close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఆ రెండు గండాలు దాటితేనే..

ప||గో|| జిల్లా సింగనపల్లి కంపెనీ వద్ద ఆగిన లాంచీలు

గోదావరి వరదల సమయంలో పాపికొండలుకు వెళ్లాలంటే ఉగ్రరూపం దాల్చే గోదావరిలో ఆ రెండు సుడిగుండాలను దాటాలి. పాపికొండలు అందాలను తిలకించి తిరిగి రావడానికి రానుపోను ఎనిమిది గంటల సమయం పడుతుంది. గోదావరి వరదల సమయంలో దేవీపట్నం నుంచి మడిపల్లి వరకు ప్రయాణం సాఫీగానే సాగుతుంది. మంటూరు వెళ్లేసరికి ఆ ప్రాంతంలో నదికి ఇరువైపులా కొండలు ఉండటంతో పాటు, సుడులు తిరిగే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మంటూరు దాటే వరకు పర్యాటక బోటును చాకచక్యంగా దాటించాలి. ఆ తర్వాత దేవుడుగొంది నుంచి కచ్చులూరు మందం వైపునకు సుడిగుండాల్లోకి వెళ్లకుండా తూటుకుంట వైపు నుంచి పాపికొండలుకు వెళ్లాలి. ఈ రెండు సుడిగుండాలు దాటితేనే పర్యాటకులంతా పాపికొండలుకు సురక్షితంగా చేరుకునేది. శిక్షణ, నైపుణ్యం లేని డ్రైవర్లు పర్యాటకులను తీసుకెళ్తూ ఇటువంటి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

- న్యూస్‌టుడే, దేవీపట్నం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.