close

గురువారం, అక్టోబర్ 17, 2019

ప్రధానాంశాలు

ధాన్యం కమీషన్‌కు..ఎదురుచూపులే!

ఐకేపీ మహిళలకు తప్పని నిరీక్షణ
జిల్లాకు అందాల్సిన డబ్బులు రూ. 19.17 కోట్లు
న్యూస్‌టుడే, కోర్టుచౌరస్తా(కరీంనగర్‌)

రైతులు పండించిన వరి ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నేరుగా ధాన్యానికి మద్దతు ధర కల్పించి వివిధ సంస్థలతో కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాలు(ఐకేపీ), మెప్మా, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల కల్లాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తోంది. రైతులకు ఏటా గిట్టుబాట ధర లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన వారికి ఇచ్చే కమీషన్‌ డబ్బుల చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తోంది. ఇప్పటికీ మూడు సీజన్లకు సంబంధించిన రూ.19.17 కోట్ల కమీషన్‌ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఏడాదిన్నరగా బకాయిలు విడుదల చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎండలో పనిచేసినా వీవో కేంద్రాలకు వచ్చే కమీషన్‌ డబ్బుల్లో జాప్యం చేయడం తగదని ఐకేపీ సంఘాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఐకేపీ, ప్రాథమిక సహకారం సంఘాల సభ్యులతో రైతుల కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టి, అక్కడే ధాన్యాన్ని తూకం వేయిస్తోంది. సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించిన అనంతరం రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. ధాన్యానికి నాణ్యమైన ధర నిర్ణయించి కామన్‌ గ్రేడ్‌, గ్రేడ్‌ ‘ఏ’ రకాలుగా నిర్ణయించి కామన్‌ రకానికి రూ.1750, గ్రేడ్‌‘ఎ’ రకానికి రూ.1770 చెల్లిస్తోంది. అన్నదాత నుంచి ఇలా సేకరించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్‌ డబ్బులు సంఘాల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా.. మూడు సీజన్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు అందటం లేదని ఐకేపీ మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2017-18 రబీకి సంబంధించి రూ.5,66,13,102, 2018-19 ఖరీఫ్‌కు సంబంధించి రూ.7,51,40,506, రబీ కొనుగోళ్లలో రూ.6 కోట్ల వరకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది.

విడతల వారీగా వస్తున్నాయి - శ్రీకాంత్‌, డీఎం. సివిల్‌సప్లై
గతంలోనే 2017-18 ఖరీఫ్‌ సీజన్‌ కమీషన్‌ డబ్బులు వచ్చాయి. వచ్చే నెలలో మరి కొన్ని డబ్బులు అందనున్నాయి. విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నాం.

మరిన్ని వార్తలు

కిరోసిన్‌ సరఫరాలో అనిశ్చితి

జిల్లాలో కిరోసిన్‌ సరఫరాపై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న కుటుంబాలకు కిరోసిన్‌ సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో కిరోసిన్‌ సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. తక్కువ మొత్తంలో ఉన్న కిరోసిన్‌ను సరఫరా చేసేందుకు ఏజెన్సీలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో ప్రతి నెలా 15, 16వ తేదీ వస్తేగాని అలాట్‌మెంట్‌, సరఫరా జరగడం లేదు. పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రతి నెలా 15వ తేదీలోగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. తగ్గిన కిరోసిన్‌ వాడకంతో జిల్లాలో ఏజెన్సీలు పంపిణీ చేయడానికి ఇష్టపడటం లేదు. జిల్లాలో ఎంతోకొంత కిరోసిన్‌ వినియోగం జరుగుతుండటంతో చేసేదిలేక కొన్ని ఏజెన్సీలు సరఫరా చేస్తుండగా కొన్ని చేయడంలేదు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.