close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఆరు వరుసల రోడ్డు

● కలెక్టరేట్‌ నుంచి రైల్వేగేటు వరకు

● జిల్లాకేంద్రంలో తగ్గనున్న ట్రాఫిక్‌ రద్దీ

● ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఆర్‌అండ్‌బీ

న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం


విస్తరించనున్న కామారెడ్డి ప్రధాన రోడ్డు

జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిని ఆరు వరుసలుగా మార్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత కలెక్టరేట్‌ నుంచి పాత రాజంపేట రైల్వేగేటు వరకు విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రోడ్లు భవనాల శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి త్వరలో ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్‌ రద్దీ అమాతం తగ్గుతుంది. నిత్యం ఈ మార్గంలో 50-60 వేల వాహనాలు తిరుగుతుంటాయి.

మూడేళ్లు గడిచినా విస్తరణ లేదు

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి మూడేళ్లు గడుస్తోంది. పట్టణంలో సుమారు లక్ష జనాభా నివాసం ఉంటోంది. ఇతర గ్రామాల నుంచి నిత్యం 50 వేల మంది వివిధ పనుల నిమిత్తం జిల్లాకేంద్రానికి వస్తుంటారు. పట్టణంలో పాత జాతీయ రహదారి ఒక్కటే ప్రధాన మార్గం. బైపాస్‌ రోడ్డు పూర్తికాగానే దీని నిర్వహణ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. అయితే పెరిగిన జనాభా, వాహనాల వల్ల రోడ్లు రద్దీగా మారుతున్నాయి. కొత్త బస్టాండు, నిజాంసాగర్‌ రోడ్డు, చౌరస్తా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం విపరీతంగా రద్దీ ఉంటోంది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. అయితే ఇరుకు రోడ్లును ఇప్పటి వరకు విస్తరించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ శాఖ ప్రస్తుత రోడ్డును ఆరు లేన్ల మార్గంగా విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది.

అందుబాటులోకి వస్తే మేలు

కామారెడ్డి పట్టణంలో ప్రధాన రోడ్డును విస్తరించడానికి పరిస్థితి అనువుగా ఉంది. రోడ్డుకు సమీపంగా ఉన్న దుకాణాలను మున్సిపల్‌ అధికారులు మూడేళ్ల కిందటే తొలగించారు. ఆరువరుసల రహదారి నిర్మాణానికి అడ్డంకులు లేవనే చెప్పొచ్ఛు డిగ్రీ కళాశాల నుంచి హౌసింగ్‌ బోర్డు కాలనీ వరకు విస్తరించే రోడ్డును సర్వీస్‌ రోడ్డుగా మారిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డుకు ఎడమ, కుడి వైపు చివర్లో ఉండే సర్వీస్‌ రోడ్లపై వాహనాలను రెండు వైపులా అనుమతి ఇస్తే ప్రధాన రోడ్డుపై రద్దీ మరింత తగ్గుతుంది.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం

- మహేందర్‌, ఈఈ ఆర్‌అండ్‌బీ, కామారెడ్డి

ఆరు వరసల రోడ్డు కోసం త్వరలో ప్రతిపాదనలు పంపిస్తాం. పాత కలెక్టరేట్‌ నుంచి పాత రాజంపేట రైల్వేగేటు వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నాం. అంచనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతికి పంపిస్తాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభమవుతాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.