close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

కశ్మీరంలో స్వేచ్ఛాయుత వాతావరణం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్టికల్‌ 370- కాశ్మీరంలో శాంతికుసుమాలు అనే పుస్తకంతో పాటు జాతీయ సమగ్రతపై కమల్‌ సందేశ్‌ పేరుతో రూపొందించిన పుస్తకాలను ఆయన నిర్మాతలు అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌లతో పాటు దర్శకులు నాగ్‌అశ్విన్‌లకు జూబ్లీహిల్స్‌ నవనిర్మాణ్‌నగర్‌లోని వైజయంతీ మూవీస్‌ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను జోషి వివరించారు. సినీ చిత్రీకరణకు కాశ్మీర్‌ ఇప్పుడు ఎంతో అనువైన ప్రాంతమన్నారు. అక్కడ సినిమాలు తీయాలని వారికి సూచించారు. ఇందుకు స్పందించిన అశ్వనీదత్‌ ఇప్పటికే ఒక చిత్రం అక్కడ ప్రణాళిక వేసుకున్నామని, మరో సినిమాను కచ్చితంగా అక్కడే చిత్రీకరిస్తామని చెప్పారు. గతంలో కశ్మీర్‌ వెళ్తే ఇండియాకు ఎప్పుడు తిరిగివెళ్తారని అడిగేవారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, సంపర్క్‌ అభియాన్‌ సభ్యులు అమర్‌నాథ్‌, బాల్‌రెడ్డి, భాజపా నాయకులు మేచినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబరు 76లో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి ప్రహ్లాద్‌ జోషి వెళ్లి పుస్తకాలను అందజేశారు.

ప్రధాని సాహసోపేత నిర్ణయాలకు ప్రపంచ మద్దతు
సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశ ప్రధాని నరేంద్రమోదీ పాలనలో తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో మంగళవారం ఆయన రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.