close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

చెరువులో దొరికిన పసివాడు క్షేమం

ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఒంటిపై గాయాలు

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తులు కేపీహెచ్‌బీ ఠాణా పరిధి అంబీర్‌ చెరువు ఒడ్డున వదిలేసిన రోజుల వయసున్న పసివాడిని పోలీసులు మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో పసివాడి ఒంటిపై గాయాలున్నాయి. షుగర్‌ లెవెల్స్‌ తగ్గడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఐసీయూలోని వార్మర్‌ బాక్స్‌లో ఉంచి ప్రతి 2 గంటలకు పాలు పడుతున్నారు. ప్రస్తుతం పసివాడు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో చెరువు ఒడ్డున ఓ పసికందు గుక్కపట్టి ఏడుస్తుండటాన్ని స్థానికంగా చేపలు విక్రయించేవారు గమనించారు. వారు వెళ్లి చూసేసరికి పసివాడి శరరీం గుర్రపుడెక్కపై, కాళ్లు చెరువు నీళ్లలో ఉన్నాయి. ఎల్లమ్మబండకి చెందిన పద్మ దంపతులు ఆ పసివాడిని అక్కున చేర్చుకుని వెంటనే పాలు పట్టి కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. 108లో హైదర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి బరువు 2.2 కిలోలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. బుధవారం సీఐ లక్ష్మీనారాయణ పసివాడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అమీర్‌పేటలోని స్త్రీ శిశు సంక్షేమ భవన్‌కి అప్పగించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆ చిన్నారిని తాము పెంచుకుంటామని ఇప్పటికే పలువురు పోలీసులను సంప్రదించడం విశేషం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.