close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

గీతం వర్సిటీకి రీసైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అవార్డు

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో వ్యర్థాలు సేకరించడంతో పాటు విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చారని పేర్కొంటూ రీసైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అవార్డు అందజేశారు. ఈ మేరకు బుధవారం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్‌ రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిల చేతుల మీదుగా రెసిడెన్షియల్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యర్థాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి యువతరాన్ని ప్రేరేపించారని చెప్పారు. ఫలితంగా 45 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు సేకరించారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో బాధ్యత పెంచారని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.