close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

20న కడ్తాల్‌లో ఉద్యోగ మేళా

కడ్తాల్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం (చెన్నకేశవస్వామి ఆలయ ముఖద్వారం పక్కన) మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పదోతరగతి పూర్తి చేసి ఆపై చదివిన 19-30 సంవత్సరాలలోపు యువతీ యువకులు అర్హులన్నారు. ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు,, బయోడేటా, పాస్‌ఫొటోలు తీసుకొని అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. ఎంపికైనవారికి రూ.11,190 వేతనం, డీఏ రూ.110, టీఎ, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌ సదుపాయం ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 91007 00227, 96665 07240 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.