close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాలని వినతి

దేశవ్యాప్త లారీల సమ్మెకు పాక్షిక మద్దతు
స్టేట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందారెడ్డి

వనస్థలిపురం: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీలోని లోపాలను అడ్డుపెట్టుకుని లారీ యజమానుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతూ తెలంగాణ స్టేట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.నందారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కొందరు దళారులు ఇసుక కొరతను సృష్టించి అందుబాటులో ఉన్న ఇసుకను ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాల కోసం బల్కులో డీడీల రూపంలో కట్టబెట్టి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారని తెలిపారు. టీఎస్‌ఎండీసీ నగరంలో నిర్వహిస్తున్న డంపింగ్‌ యార్డులో ఇసుకను కష్టమర్లు కొనడానికి ముందుకు రావడం లేదని, ఆ ఇసుకను లారీ యజమానులు బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. గురువారం నుంచి చేపట్టనున్న దేశవ్యాప్త లారీల సమ్మెకు పాక్షిక మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆటోనగర్‌ ఇసుక లారీల యజమానుల సంఘ అధ్యక్షుడు సుర్విరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.