close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

అంధులు వీరు.. దారి చూపుతారు

సాంకేతికత వినియోగంలో మార్గదర్శకులు
ఈనాడు, హైదరాబాద్‌

ళ్లు మూసుకుని ఒక అడుగు కూడా తడబడకుండా వేయలేం. అలాంటిది అంధులు జీవితాంతం మనుగడ సాగించడం ఎంత కష్టమో.. ఆ ఊహే భయంకరం. అయినా వారు తమ వైకల్యలోపాన్ని సామర్థ్యంగా మలుచుకున్నారు. అందరిలా పూర్తిస్థాయిలో జీవిస్తూ.. తమ తోటి అంధులకు ఉపయోగపడే సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చారు. బండ్లగూడ జాగీర్‌లోని శారదాదామం శిక్షణ కేంద్రంలో ఇటీవల ముగిసిన దివ్యాంగన్‌ సదస్సుకు హాజరైన కొందరిని పలకరించినప్పుడు వారి అభిప్రాయాలు పంచుకున్నారు.

సాంకేతిక తోడ్పాటుతో పైలెట్‌ కాగలరు..
దిల్లీకి చెందిన 38 సంవత్సరాల డాక్టర్‌ అమిత్‌కుమార్‌ శర్మకు పూర్తిగా కళ్లు కనబడవు. సహాయ ఆచార్యులుగా సంస్కృతం బోధిస్తారు. చూపు లేదనే విచారం లేదని.. విద్య ద్వారా ఎంతో వెలుగు వచ్చిందని చెబుతాయన. వివాహం చేసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రచయిత కావాలనేది ఆయన కోరిక. సాంకేతికత అంధులకు చాలా సహాయపడుతుందని అంటారు. ఇది వారిని స్వతంత్రంగా ఉండటానికి వీలు కల్పిస్తుందని తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘నేను సొంతంగా ఫోన్‌ ఉపయోగిస్తాను. వాట్సాప్‌ కూడా వాడతాను. స్క్రీన్‌ రీడింగ్‌ సాంకేతికత సహాయంతో ఈ మెయిల్స్‌ను పంపుతాను. నా వరకు ఈ సాంకేతికతను కొనుగోలు చేయగలను. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారి సంగతేమిటి? సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలోపం ఉన్నవారు సైతం ఉపయోగించడానికి సరసమైనదిగా ఉండాలి. సాంకేతికత తోడ్పాటు ఉంటే అంధులు సైతం విమానాన్ని నడిపే పైలెట్‌ కాగల్గే ఆత్మవిశ్వాసం తమ సొంతం’ అంటారు ఆయన.

ఎందరికో ఉపాధి చూపారు..
సుభాష్‌ గుప్తా వైకల్యమున్న బ్యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టారు. తనలాంటి వారిని ఎందరికో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. వేర్వేరు బ్యాంకుల్లో 72 మంది ఉద్యోగాలు సాధించేలా తోడ్పాటు అందించారు. బాగున్న వ్యక్తుల పెళ్లికోసమే చాలా వెతుకులాట తప్పడం లేదు. అలాంటి వైకల్యంతో బాధపడేవారిని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? వీరి ఇబ్బందులను గుర్తించే సుభాష్‌ గుప్తా వికలాంగుల కల్యాణ వేదికను ప్రారంభించారు. బాలురు, బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్‌ను నిర్వహిస్తున్నారు.

సొంతంగా పాఠశాల నడుపుతున్నారు...
చెన్నైకి చెందిన గోవిందరాజన్‌ అంధత్వంతో కుంగిపోకుండా ఔత్సాహికవేత్తగా ఎదిగారు. 1500 మంది విద్యార్థులతో ఒక పాఠశాలను విజయవంతంగా నడుపుతున్నారు. ఆయనకు సాంకేతికతపై పెద్దగా పట్టులేకపోయినా.. అంధులు టెక్నాలజీతో అద్భుతాలు చేయగలరని నమ్ముతున్నారు. ‘నా తోటివారు ఎంతోమంది సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. సాధారణ వ్యక్తుల మాదిరే తమ పనులను చేసుకోగల్గుతారు. ప్రజాసౌకర్యాలైన ప్రజరవాణా, కార్యాలయాల వరకు వైకల్యంతో బాధపడేవారికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నా’ను అన్నారు.

నేత్ర దానం తప్పనిసరి చేయాలి..
- డాక్టర్‌ దయాల్సింగ్‌ పవార్‌, అధ్యక్షుడు, సక్షమ్‌ అఖిలభారత సమాఖ్య
దేశ జనాభాలో ఏటా ఒకశాతం మంది చనిపోతున్నారు. వీరి కళ్లు మంటల్లో కాలిపోతున్నాయి. ప్రతి ఒక్కరు నేత్ర దానం చేస్తే దేశంలో అంధత్వం లేకుడా చేయవచ్చు. ఎన్నో లక్షల మందికి కంటి వెలుగును ప్రసాదించినట్లు అవుతుంది. కానీ ప్రస్తుతం ఇది జరగడం లేదు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కంటిదానంపై చైతన్యం తీసుకురావాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.