close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

కృష్ణాపురం ప్రాజెక్టు గేటు ఎత్తివేత

నిండు కుండలా దర్శన మిస్తున్న కృష్ణాపురం ప్రాజెక్టు

అమ్మపల్లి(కార్వేటినగరం), న్యూస్‌టుడే: జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టు అయిన కృష్ణాపురం జలాశయం నుంచి వరదనీటిని గురువారం రాత్రి కుశస్థలి నదిలోకి విడుదల చేశారు. బుధవారం రాత్రి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కుశస్థలి నదిలో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు ఉద్ధృతంగా వచ్చి చేరడంతో గురువారం సాయంత్రానికే ప్రాజెక్టులో నీటి సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని వరదనీటిని కుశస్థలి నదిలోకి విడుదల చేయడానికి నిర్ణయించారు. సాయంత్రం విద్యుత్తు తీగలు తెగిపడడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్తుశాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. నీటిపారుదలశాఖ అధికారులు జనరేటర్‌ ద్వారా మొదటి గేటును 5సెంమీ మేర ఎత్తి కుశస్థలి నదిలోకి వరదనీటిని విడుదల చేశారు. వర్షం కురిసి నీరు చేరే పరిస్థితుల్లో ఉన్న మరో రెండు గేట్లలో ఇంకోదాన్ని ఎత్తే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖ డీఈ రత్నారెడ్డి, ఏఈ రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ ప్రాజెక్టులో గరిష్ట నీటి సామర్థ్యం 199.37 ఎంసీఎఫ్‌టీలు కాగా గురువారం సాయంత్రానికి 195.57 ఎంసీఎఫ్‌టీలకు చేరుకుందన్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 950 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 20 క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరదనీటిని మొదట కుడి, ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు పరిధిలోని 16 చెరువులకు విడుదల చేశామన్నారు. వరదనీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో మొదటి గేట్‌ ద్వారా కుశస్థలినదిలోకి వరదనీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కుశస్థలి నదిలో వరదనీరు ప్రవహిస్తుండడంతో నదీ పరీవాహక ప్రాంతంలోని వారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రధాన గేటు నుంచి విడుదవుతున్న వరదనీరు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.