close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

జిల్లాలో జోరు వాన

8 మండలాల్లో 10.0 సెం.మీ.పైగా నమోదు


పెనుమూరులో పంట పొలాల్లో ప్రవహిస్తున్న వర్షపునీరు

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: కరవుతో అల్లాడుతున్న జిల్లాకు కాస్త ఉపశమనం లభించింది. జిల్లాలోని 57 మండలాల్లో బుధవారం రాత్రి మోస్తరు నుంచి కుండపోత వర్షం కురిసింది. సరాసరిగా జిల్లా వ్యాప్తంగా 40.5 మి.మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అక్టోబరులో రబీ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ వర్షం రబీలో వరి, వేరుసెనగ తదితర పంటల సాగుకు దోహదపడుతుందని రైతులు ఆశిస్తున్నారు.

 

అత్యధికంగా విజయపురంలో...

జిల్లాలో అత్యధికంగా విజయపురం మండలంలో 193.2 మి.మీటర్లు కురవగా.. అత్యల్పంగా కురబలకోట మండలంలో 3.0 మి.మీ వర్షపాతం నమోదైంది. నారాయణవనం మండలంలో 171.0, చిత్తూరు 150.0, నగరి 118.0, పుత్తూరు 115.0, యాదమరి 105.0, తవణంపల్లె 103.0, కార్వేటినగరం 100.0, నిండ్ర 90.0, పెనుమూరు 86.4, పిచ్చాటూరు 84.2, బంగారుపాళ్యం 80.2, పాకాల 74.2, పాలసముద్రం 70.8, వెదురుకుప్పం 70.4, గంగాధరనెల్లూరు 67.6, సత్యవేడు 66.2, కేవీబీపురం 60.2, నాగలాపురం 55.6, గుడిపాల 50.2, ఎస్‌ఆర్‌పురం 49.0, వరదయ్యపాళెం 48.6, ఐరాల 48.4, పులిచెర్ల 44.0, పెద్దపంజాణి 40.6, పూతలపట్టు 38.4, గంగవరం 35.6, తిరుపతి నగరం 34.6, పలమనేరు 33.6, వడమాలపేట 29.2, బీఎన్‌కండ్రిగ 27.2, రేణిగుంట 25.6, కలకడ 24.6, ఆర్‌సీపురం 24.6, కేవీపల్లి 22.8, సదుం 22.4, తిరుపతి గ్రామీణ 22.0, తొట్టంబేడు 18.4, పెద్దమండ్యం 16.6, పుంగనూరు 15.2, శ్రీకాళహస్తి 14.8, చిన్నగొట్టిగల్లు 13.6, ఎర్రావారిపాళ్యం, చంద్రగిరి 12.2, రొంపిచెర్ల 11.8, పీలేరు 9.6, గుర్రంకొండ 8.8, మదనపల్లె 8.2, ఏర్పేడు, రామసముద్రం, తంబళ్లపల్లె 8.0, కలికిరి 5.4, వాల్మీకిపురం, నిమ్మనపల్లె 4.6, చౌడేపల్లె, బైరెడ్డిపల్లె మండలంలో 3.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

చిప్పారపల్లె వద్ద వేరుసెనగ పంటలో నిలిచిన వర్షపునీరు

చెరువులకు నీరు

పెనుమూరు, న్యూస్‌టుడే: జీడీ నెల్లూరు, నగరి మండలాల్లో భారీ వర్షం కురిసింది. పంట పొలాలను నీరు ముంచెత్తుతోంది. అటవీ ప్రాంతాల సమీపంలోని చెరువులు, కుంటలు దాదాపుగా మొరవలు పారుతున్నాయి. ఈ నీరు దిగువనున్న చెరువులకు చేరుతోంది. పెనుమూరు మండలంలోని చిప్పారపల్లె పంచాయతీలోని అప్పయ్యచెరువు, అరుణాచలంకుంట, చుంచువాండ్లచెరువు పూర్తిగా నిండాయి. తిరివిరెడ్డిపల్లె పంచాయతీలో రామభద్రయ్యగారి ఎగువ, దిగువచెరువులు మొరవలు పారుతున్నాయి. ఈ నీరు చింతలచెరువుకు చేరుతుంది. కలికిరి, చిన్నమరెడ్డికండిగ, లక్కలపూడివాండ్లఊరు ప్రాంతాల్లోని చెరువులన్నీ చాలా వరకు నిండుతున్నాయి. పంట పొలాల్లోనూ వర్షపునీరు చేరింది. చిప్పారపల్లె సమీపంలో వేరుసెనగ పంటలో నీరునిలిచింది. చింతలచెరువుకు నీటిని అందించే కాలువ లేక పోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపునీరు పంటపొలాల ద్వారా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో ఎన్టీఆర్‌ జలాశయం నుంచి ఏర్పాటు చేసిన కాలువలోకి నీరు చేరి గంగుపల్లె చెరువుకు చేరుతోంది. చెక్‌డ్యాంలు నిండి నీరు ప్రవహిస్తోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.