close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

బ్యాంకు సేవలు అందరికీ చేరువవ్వాలి

 రూ.78 కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం

 కేడీసీసీబీ ఛైర్మన్‌, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌


కామధేను డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్న కేడీసీసీబీ ఛైర్మన్‌, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌

కర్నూలు సచివాలయం : రైతులకు అందుబాటులో ఉండి సహకార రుణాలు మంజూరు చేసేందుకు బ్రాంచి మేనేజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేడీసీసీబీ ఛైర్మన్‌, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో 23 బ్రాంచి మేనేజర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ ఆర్థిక లావాదేవీలపై సామాన్య రైతులు, ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో విస్తృతంగా ప్రచారం కల్పించి బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీపై మేనేజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. జాయింట్‌ లయబిలిటీ (జేఎల్‌జీ) గ్రూపులకు కేవలం 3 బ్రాంచిలు మాత్రమే రుణాలు మంజూరు చేశాయన్నారు. అన్ని బ్రాంచీలలో జేఎల్‌జీ గ్రూపులకు రుణాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కామధేను పేరుతో డిపాజిట్ల సేకరణకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని, ఈ పథకం ద్వారా రూ.35 కోట్ల మేర లక్ష్యాలను నిర్దేశించినట్లు వివరించారు. గత మూడు రోజుల్లో రూ.4.44 కోట్ల డిపాజిట్లు సేకరించారని, మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కౌలు రైతులకు రుణాల లక్ష్యం రూ.10 కోట్లు, పంట రుణాలకు రూ.10 కోట్లు, రైతు నేస్తానికి రూ.10 కోట్లు, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి రూ.30 కోట్లు, కర్షక జ్యోతి పథకానికి రూ.18 కోట్ల రుణ లక్ష్యాలను నిర్దేశించామన్నారు. కోడుమూరు బ్రాంచి మినహా మిగిలిన అన్ని బ్రాంచిలు స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరు చేయడం లేదన్నారు. రుణాల రికవరీలో కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయని, దీనిపై లక్ష్యాలను నిర్దేశించి రికవరీ చేయాలని చెప్పారు. డిసెంబరు చివరినాటికి రూ.200 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నారు. అంతకు ముందు కేడీసీసీబీ ఛైర్మన్‌ ఛాంబరులో 6 జాయింట్‌ లయబిలిటీ గ్రూపులకు రూ.6 లక్షల రుణాల చెక్కును కలెక్టర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు మొదటిసారి కేడీసీసీబీ బ్యాంకు ఛైర్మన్‌ హోదాలో సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ను సీఈవో రామాంజనేయులు, జీఎం శివలీల, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్‌, నాగిరెడ్డి తదితరులు సత్కరించారు. నాబార్డు డీడీఎం పార్థవ, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.