close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

గ్రామ సచివాలయ ఫలితాలొచ్చాయ్‌!  

రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు

 ఇక నియామకాలే ఆలస్యం

 

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: గ్రామ సచివాలయాల కొలువులకు అభ్యర్థులు జిల్లాలో లక్షల్లో పోటీ పడ్డారు. 19 రకాల గ్రామ, వార్డు పోస్టులకు 14 పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహించిన పది రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేశారు. జిల్లాలో పలువురిని ర్యాంకుల వరించాయి. అవుకుకు చెందిన బీటెక్‌ విద్యార్థి ఉపేంద్రం సాయికుమార్‌ రాజు క్యాటగిరి-2(బి)లో 122.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారు. జిల్లాస్థాయిలోనూ పలు ర్యాంకులు దక్కాయి. కేటగిరి-2(బి)లో 117.5 మార్కులతో అలువాల గణేశ్‌ తరువాత స్థానంలో నిలిచారు. గ్రూప్‌(ఏ)లో 115 మార్కులతో వీరంరెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి జిల్లా మొదటి ర్యాంకు సాధించారు. మనోజ్‌కుమార్‌రెడ్డిది కడప జిల్లా కమలాపురం మండలం అగస్తలింగాయపల్లె గ్రామానికి చెందినవాడు. కర్నూలు జిల్లాలో చదవడంతో స్థానికతతో ఇక్కడి నుంచే పోటీ పరీక్షలకు హాజరై ఈ ఘనత సాధించారు. ఉద్యాన శాఖ, పట్టుపరిశ్రమ శాఖ, ఆరోగ్య కార్యకర్తలు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, వార్డు హెల్త్‌ కార్యదర్శి ఇలా మరో ఏడుగురు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారు. అర్హత సాధించిన అభ్యుర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

27న నియామక ఉత్తర్వులు...

ఫలితాలు వెలువడంతో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఆపై ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, రిజర్వేషన్‌ ప్రకారం నియమాకాలు చేపట్టాలి. జిల్లాలో 9,597 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు ఏకంగా 2,01,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 676 కేంద్రాల్లో 1,80,728 మంది పరీక్షలు రాశారు.

● ఈ నెల 21, 22 తేదీల్లో ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపి, 23వ తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. ఈ నెల 27న నియామక ఉత్తర్వులు అభ్యర్థులకు పంపాలని సూచించారు.

రైతుబిడ్డ రాణింపు

డోన్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: రైతుగా తనతండ్రి పడుతున్న కష్టాలు చూశారు. వ్యవసాయాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసి సేద్యంలో కొత్త ఒరవడులు సృష్టించాలని అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుకున్నారు. వ్యవసాయ శాఖలోనే కొలువుసాధించాలనే తపనతో నిరంతరం కష్టపడి చదివారు. సచివాలయ పరీక్షలకు నిర్వహించిన పరీక్షల్లో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ విభాగంలో 104 మార్కులు సాధించి జిల్లాలో ముందు వరుసలో నిలిచి శభాష్‌ అనిపించుకున్నారు ఆ యువకుడు.

వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం చెందిన బాలహనుమంతు, బాలరంగమ్మల కుమారుడు బాల పులేంద్ర. ప్రస్తుతం డోన్‌ పట్టణంలోని గీతాంజలి పాఠశాల సమీపంలో వీరు నివాసం ఉన్నారు. ఇతడు మహానంది కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివారు. వ్యవసాయ విభాగంతోపాటు పంచాయతీ కార్యదర్శి పరీక్షలోనూ రాణించి 75.25 మార్కులు సాధించారు. తనకు ఇష్టమైన వ్యవసాయశాఖలో ఉద్యోగం సాధించేందుకు కష్టపడ్డానని, తన తల్లిదండ్రుల కష్టానికి ఫలితం వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోస్టు సాధించేందుకు నెలరోజులపాటు రోజుకు 16 నుంచి 17 గంటల పాటు చదివినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.