close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలి

హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణులను పరిచయం చేసుకుంటున్న దృశ్యం

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌లో తమలోని నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయస్థాయికి ఎదగాలని హ్యాండ్‌బాల్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జియాఉద్దీన్‌, మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ శాంత అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌ మైదానంలో అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ బాల,బాలికల హ్యాండ్‌బాల్‌ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలను ప్రారంభించారు. ఇంటర్మీడియట్‌ స్థాయిలో చాలా మంది చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారని క్రీడల్లోనూ రాణించాలన్నారు. తద్వారా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయులు, హ్యాండ్‌బాల్‌ సంఘం ప్రతినిధులు బాల్‌రాజ్‌, సర్ఫరాజ్‌ అలి, అహ్మద్‌, ముతహర్‌ పాల్గొన్నారు.

* హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టుకు ఎంఏ ఖుశామ్‌, ఆసిఫుల్లా బేగ్‌, చంద్రకాంత్‌, తన్వీర్‌, కార్తీక్‌, సమీర్‌, ప్రణయ్‌, సంతోష్‌, అమీర్‌, గుర్నాథ్‌గౌడ్‌, మోహన్‌, అనిల్‌కుమార్‌, హామెద్‌అలి, రామకృష్ణ, వంశీ మోహన్‌, అద్నాన్‌ బాలికల జట్టుకు రోజా, కృష్ణవేణి, గాయత్రి, భువనేశ్వరి, భవ్య, దివ్య, శైలజ, పార్వతమ్మ, అనురాధ, పవిత్ర, విఖిత, హరిత, రాధిక, మమత, శివాని ఎంపికయ్యారు.

22 నుంచి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు : ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి వివిధ టోర్నీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల,బాలికల జట్ల ఎంపికలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి పాపిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న మహబూబ్‌నగర్‌ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌, 24న గద్వాలలో తైక్వాండో, 25న గద్వాల స్టేడియంలో సూపర్‌ సెవెన్‌ క్రికెట్‌ జట్లు, 25న ఫుట్‌బాల్‌ పెబ్బేరు సమీపంలోని పీజేపీ క్యాంపు మైదానంలో ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు కళాశాల నుంచి బోనఫైడ్‌, పదో తరగతి మార్కుల జాబితా నకలుతో ఎంపికలకు హాజరు కావాలని సూచించారు.

అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీలకు జట్ల ఎంపిక

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : తమిళనాడు రాష్ట్రంలో జరిగే సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీలకు వివిధ జట్లను ఎంపిక చేస్తున్నట్లు పాలవరు విశ్వవిద్యాలయ ఫిజికల్‌ డైరెక్టర్‌ బాల్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న పురుషుల షటిల్‌ బ్యాడ్మింటన్‌, 25న పురుషుల టెబుల్‌ టెన్నీస్‌, 26న స్త్రీల వాలీబాల్‌ జట్ల ఎంపికలు పాలవరు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కళాశాల నుంచి అయిదుగురు విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని కోరారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి గుర్తింపు పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.