close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

కూతఘనం..వసతులుమృగ్యం

 స్వయంకృషితో ఆటగాళ్ల రాణింపు

 ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టి కరవు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ క్రీడావిభాగం

దేశంలో ప్రాచుర్యం పొందుతున్న గ్రామీణ క్రీడల్లో కబడ్డీ ఒకటి..జాతీయ స్థాయిలోనూ పట్టున్న క్రీడ ఇది. శారీరక దృఢత్వాన్ని ధైర్యాన్ని ప్రదర్శించే ఈ క్రీడలకు యువత మొగ్గు చూపుతున్నా ఆయా క్రీడా సంఘాల్లో పెద్దగా మార్పులు రావడం లేదు. వసతులు కల్పించక పోవడం, ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇవ్వకంతో సమర్థులకు అవకాశాలు దక్కడం లేదు. ప్రభుత్వం ఏళ్ల తరబడిగా శిక్షకులను నియమించడం లేదు.. తర్ఫీదు ఇచ్చే శిక్షణాసంస్థలను నెలకొల్పడం లేదు. అయినా జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధం కాకపోవడంతో క్రీడాకారులకు నష్టం వాటిల్లుతోంది.

కావల్సిన వసతులు

ఇండోర్‌ స్టేడియం అవసరం. సింథటిక్‌ మ్యాట్లు, డే, నైట్స్‌లో పోటీలను నిర్వహించడానికి విద్యుత్‌ దీపాలతో శాశ్వత స్థలం, శాశ్వత శిక్షకులు కావాలి.

1980 నుంచే జిల్లాలో కబడ్డీకి మంచి ఆదరణ ఉంది. అప్పట్లో మానిక్‌భవన్‌ పాఠశాలలో క్రీడాకారులు సాధన చేస్తుండేవారు. అక్కడ స్థలం సరిపోక అక్కడి నుంచి డీఎస్‌ఏ మైదానానికి వచ్చి సాధన చేసేవారు. అప్పుడు సుబ్బారావు అనే వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేవారు. 1993 తర్వాత ప్రభుత్వం శిక్షకుడిని నియమించలేదు. మధ్యలో కబడ్డీపై ఆదరణ తగ్గిపోవడం క్రికెట్‌ లాంటి క్రీడలపై యువత దృష్టి మళ్లింది. 2014 నుంచి ప్రోకబడ్డీ రావడంతో కావడంతో మళ్లీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో సంఘం ప్రతినిధులు క్రీడపై ప్రచారాలు ప్రారంభించారు. పల్లెల నుంచి క్రీడాకారులు రావడంతో డీఎస్‌ఏ మైదానంలో కబడ్డీ క్రీడాకారుల సాధన ఊపందుకుంది.

జిల్లాలో ఎక్కువ క్రీడాకారులు  ప్రాతినిథ్యం వహించే ప్రాంతాలు

బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌, బోధన్‌, డిచ్‌పల్లి

సీనియర్‌ క్రీడాకారులే శిక్షకులు

1993 తర్వాత నుంచి శిక్షకులు లేకున్నా సీనియర్‌ క్రీడాకారులే శిక్షణను ఇస్తూ వచ్చారు. ఇలా ఏటా జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. 2014 తర్వాత అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి క్రీడాకారుడు ఎన్‌ఐఎస్‌ ధ్రువపత్రం పొందిన మీసాల ప్రశాంత్‌ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా చుట్టుపక్కల పల్లెల నుంచి 40 మంది క్రీడాకారులు రోజు డీఎస్‌ఏ మైదానంలో శిక్షణ పొందుతున్నారు.

సౌకర్యాలు కల్పించాలి

చంద్రప్రకాశ్‌, ప్రీమియర్‌ లీగ్‌ రిఫరీ

ప్రస్తుతం క్రీడల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఉత్త కాళ్లతో మట్టి కోర్టులో మధ్యాహ్నం సమయంలోనే ఆడేవారు. కానీ ప్రస్తుతం రాత్రుళ్లు విద్యుత్‌ కాంతుల మధ్య సింథటిక్‌ మ్యాట్లు, బూట్లతో ఆడుతున్నారు. ఈ మార్పులు ఆట స్వరూపాన్నే మార్చేసింది. క్రీడాభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి అనుగుణంగా జిల్లాలోనూ వసతులను కల్పించాలి. జిల్లాస్థాయి నుంచి క్రీడాకారులకు మ్యాట్లపై ఆడే అవకాశాన్ని కల్పించాలి. మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంతో మంచి క్రీడాకారులను తయారు చేయగలుగుతాం.

ధర్మరాజ్‌గౌడ్‌ : అంతర్జాతీయ స్వాగత పోటీల్లో పాల్గొన్నారు. హిందూస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

మశ్చేంధర్‌ : జాతీయక్రీడాకారుడు. హిందుస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం

పోలీసుశాఖలో పలువురు క్రీడాకారులున్నారు.

పూర్తిస్థాయి శిక్షకుడిని నియమించాలి

మీసాల ప్రశాంత్‌, శిక్షకుడు

జిల్లాలో 1993 తర్వాత పూర్తిస్థాయి శిక్షకుడు లేడు. శిక్షకుడి ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తే క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కబడ్డీలో జాతీయస్థాయి వరకు ఆడాను. దీనిపై ఉన్న ఇష్టంతో కబడ్డీ సంఘం ప్రోత్సాహంతో ఎలాంటి డబ్బులు ఆశించకుండా డీఎస్‌ఏ మైదానంలో ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం జిల్లాలో ఎన్‌ఐఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులను గుర్తించి వారితో క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి.

క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తున్నార

అంద్యాల లింగయ్య, కబడ్డీ సంఘం కార్యదర్శి

కబడ్డీలో ఉత్తమ క్రీడాకారులను వెలికితీసేందుకు టోర్నీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది డబ్బులతో కూడుకున్న పని కావడంతో స్పాన్సర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రతిసారి స్పాన్సర్లు దొరకడం కష్టంగా ఉంటుంది. టోర్నీల నిర్వహణ వసతుల విషయంలో అనేక మార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిశాం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత కబడ్డీ అభివృద్ధికి ప్రోత్సహించారు. మైదానంలో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. సింథటిక్‌ మ్యాట్‌లను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.