close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

కర్మచారిల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలి

జాతీయ సఫాయి కర్మచారిల కమిషన్‌ సభ్యుడు జగదీశ్‌ హిర్మాణి

నాంపల్లి: రాష్ట్రంలో సఫాయి కర్మచారిల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం బాధాకరమని జాతీయ సఫాయి కర్మచారిల కమిషన్‌ సభ్యుడు జగదీశ్‌ హిర్మాణి ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ పారిశుద్ధ్య పనుల్లో, సీవరేజి మ్యాన్‌హోళ్లలోనే వారి బ్రతుకులు తెల్లవారుతుండటం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చి జగదీశ్‌ హిర్వాణి గురువారం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రవి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి మ్యానువల్‌ స్కావెంజింగ్‌ పునరావాస చట్టం-2013 అమలు అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన జంటనగరాల నుంచి తరలివచ్చిన పలువురు బాధిత సఫాయి కర్మచారిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో మున్సిపల్‌లో ఉండే స్కావెంజర్‌ పోస్టులను తొలగించివేశారని, తిరిగి ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని బాధితులు పేర్కొన్నారు. రుణాల మంజూరు కోసం ఎస్సీ కార్పొరేషన్‌లో సఫాయి కర్మచారి కోటా కింద ప్రత్యేక బడ్జెట్‌ ఉన్నా, అసలైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం లేదని తెలిపారు. పలు సమస్యలు విన్న హిర్మాణి మాట్లాడుతూ 2022 నాటికి కనీస వేతన చట్టం కింద సఫాయి కర్మచారిల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా, వారి జీవన భద్రత కోసం జీతభత్యాలు, ఆరోగ్య బీమా, వైద్య పరీక్షలు, సుస్థిర నివాసం, విద్యావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రవి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 33 మంది సఫాయి కర్మచారిలకు ఆర్థిక చేయూత ఇచ్చినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 2018-19 సంవత్సరానికి గాను 84 మందికి ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, వృత్తి నైపుణ్య కోర్సులు చేపడుతున్నట్లు వివరించారు. నగర కమిషనర్‌ అంజనీకుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, రామారావు, మాన్యానాయక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.