close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఉప సర్పంచి ఉమ్మడి చెక్‌ పవర్‌ను రద్దు చేయాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: ఉప సర్పంచి ఉమ్మడి చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ చర్యలు పంచాయతీరాజ్‌ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గురువారం కాచిగూడ స్టేషన్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ అధ్యక్షతన ‘సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కార మార్గాలు, భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉమ్మడి చెక్‌పవర్‌ లేదన్నారు. సర్పంచుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో దిల్లీలో ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడి గ్రామాలకు నేరుగా నిధులు ఇచ్చేలా ఉద్యమిద్దామని తెలిపారు. తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోడండరామ్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థను దిగజార్చేందుకే కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు. అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుని అన్ని వ్యవస్థలను నీరుగార్చుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రగతి భవన్‌ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రం నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించడం అన్యాయమన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.5,375 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నిధుల వినియోగంపై త్వరలో కేంద్రం ఆడిట్‌ చేయనుందన్నారు. పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుకు నిరసనగా అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతారని ప్రకటించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సర్పంచుల సంఘం తరఫున అభ్యర్థిని బరిలోకి దించుతామన్నారు.  శ్రీనివాస్‌, దోసపాటి రాము (లోక్‌సత్తా), సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి  ప్రసంగించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.