close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు

పట్టించుకోని పాఠశాలల యాజమాన్యాలు, ట్రాఫిక్‌ పోలీసులు
ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను కుక్కుతున్న వైనం
ఈనాడు, హైదరాబాద్‌

నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కి అధికారుల కంట్లో పడకుండా ఇంటికి చేరితే చాలు.. హీరోగా ఫీలైపోతారు. కానీ ఆ అధికారులు చూడకున్నా.. అడుగుకో ఆపద, క్షణంలో వెయ్యో వంతులో పలకరించే ప్రమాదాలు ఉన్నాయని మరిచిపోతున్నారు. అయిదు నిమిషాల ప్రయాణానికి అన్నీ ఎక్కడ చూసుకుంటాం అని అసహనం వ్యక్తం చేస్తున్న వారు నగరంలో తరచూ కనిపిస్తున్నారు.
తాజాగా ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఆటో బోల్తా పడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.మంగళవారం ఎల్‌బీ స్టేడియం వద్ద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద నేపథ్యంలో నగరంలో పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్లే ఆటోలను ‘ఈనాడు’ పరిశీలించగా డ్రైవర్ల నిర్లక్ష్యం కొండంత కనిపించింది.
* గ్రేటర్‌ వ్యాప్తంగా 2 లక్షలకు పైచిలుకు ఆటోలున్నాయి.
* 50శాతంపైనే ఆటోలు పిల్లలను బడికి తీసుకెళ్లి, తీసుకొస్తుంటాయి.
* ఇందులో దాదాపు 70-80 శాతం ఆటోల డ్రైవర్లు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు.
పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల్లో అవగాహన కొరవడుతోంది. ట్రాఫిక్‌ పోలీసులు సాధారణం అన్నట్లు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.