close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

రూ.2 కోట్లతో రహదారుల ఆధునికీకరణ
అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడుతున్న చల్లా
అవుకు, న్యూస్‌టుడే: అవుకులో శిథిలమైన రహదారిని రూ.2 కోట్లతో ఆధునికీకరించనున్నామని, ఈమేరకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాష్ట్రశాసన మండలి సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక చల్లా భవన్‌లో జాతీయ రహదారుల, పశుసంవర్థక శాఖ, ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులతో వేరువేరుగా సమావేశం నిర్వహించారు. అవుకులో అన్నిరకాల సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అవుకులోని రహదారి పూర్తిగా శిథిలమైందని, దశాబ్దాల తరబడి మరమ్మతులు లేకపోవడమే సమస్యకు కారణమన్నారు. అవుకు ప్రవేశ మార్గంలోని దళిత కాలనీ నుంచి గ్రామం వెలుపల బాబామందిరం వరకు ఎస్సీకాలనీ, మార్కెట్‌, బస్టాండు, గుర్రాలపేట మీదుగా రహదారిని నిర్మిస్తారని వెల్లడించారు. జాతీయ రహదారుల విభాగం ఈఈ సుబ్బారావు, డీఈలు గంగాధర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. పశుగణాలకు మెరుగైన సేవలు అందించాలని ఆ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు. పశువైద్య సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. జిల్లా సహాయ సంచాలకుడు వెంకటరమణ, పలుకూరు, అవుకు, గుండ్ల శింగవరం పశువైద్య కేంద్రాలకు చెందిన వైద్యులు రామకుమార్‌రెడ్డి, ఐశ్వర్య సమస్యలను వివరించారు. ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ సిబ్బందితో జరిగిన సమావేశంలో కేంద్రాల పనితీరును తెలుసుకొని దిశానిర్దేశం చేశారు. అవుకులో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల సమస్య ఉందని, సమావేశ భవనాన్ని నిర్మిచాలని ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు నాగసుంకమ్మ కోరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.