close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

పేద బాలికకు ఉచిత శస్త్రచికిత్స

చేస్తామని ముందుకొచ్చిన నిమ్స్‌ వైద్యుడు
‘ఈనాడు’ కథనంతో దాతల చేయూత

మాదాపూర్‌, పంజాగుట్ట న్యూస్‌టుడే: ‘అరుదైన జబ్బుతో పేద బాలిక అవస్థ’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. బాలిక లయశ్రీ (14)కి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామని నిమ్స్‌ ఆసుపత్రి సర్జికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.బీరప్ప ముందుకు వచ్చారు. దీంతో కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌ కాలనీవాసులు, మసీద్‌ బండ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు హుటాహుటిన ఆ బాలికను నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చేర్చుకున్న వైద్యులు వెంటనే ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో శస్త్రచికిత్స చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కార్యాలయ అధికారులు సైతం ‘ఈనాడు’కు ఫోన్‌ చేసి లయశ్రీ వివరాలు సేకరించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. లయశ్రీ దయనీయస్థితి గురించి ‘ఈనాడు’ ద్వారా తెలుసుకున్న మరికొందరు దాతలు తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాతలు మొత్తం రూ.1,97,683 విరాళాలిచ్చారు. వీటిలో ఓ వ్యక్తి ఏకంగా రూ.లక్ష అందించారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.