close

గురువారం, అక్టోబర్ 24, 2019

ప్రధానాంశాలు

మంత్రివర్గంలో సామాజిక న్యాయం విస్మరించారు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నిరసనగా 22న వరంగల్‌లో సామూహిక మహాదీక్ష

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయాన్ని విస్మరించారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన చూసినా, అసెంబ్లీ, మండలి సభ్యుల సంఖ్యాపరంగానూ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం జరగలేదని, వెలమలపై ప్రేమతో నాలుగు కేటాయించి, భయంతో రెడ్డిలకు ఆరు కేటాయించారని విమర్శించారు. రాష్ట్రంలో 12శాతం జనాభా గల మాదిగ, దాని ఉపకులాలకు జనాభా ప్రకారం మంత్రివర్గంలో స్థానం లేకపోగా.. ఎమ్మెల్యేలుగా, మండలి సభ్యులుగా 12 మంది ఉండగా దాని ద్వారానూ సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రకటించారు.. జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 22న వరంగల్‌లోని కేడీసీ మైదానంలో సామూహిక మహాదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే మహాదీక్షకు ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల తరపున వేలాది మంది పాల్గొంటున్నారన్నారు. ప్రస్తుత మంత్రి మండలిని రద్దుచేసి కొత్తగా విస్తరించాలని, అందులో జనాభా ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్‌ చేశారు. చాలా కులాలకు మొండిచేయి చూపారని దుయ్యబట్టారు. అలానే ఓసీలోనూ బ్రాహ్మణ, వైశ్య వర్గాలు ఉన్నారు వారికెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మాదిగ ఉపకులాల కోసం 22న మహాదీక్ష చేస్తున్న తాము ఇతర వర్గాల కోసం త్వరలో నగరంలో మహాదీక్ష చేస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.