close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’ ప్రకటించాలి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌
ఫీవరాసుపత్రిలో రోగులకు పరామర్శ

నల్లకుంట, న్యూస్‌టుడే: నగరం నలువైపులా వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేసే వరకు పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. డెంగీ, ఇతర విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’ని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం నల్లకుంటలోని ఫీవరాసుపత్రిని సందర్శించిన ఆయన.. వార్డుల్లో రోగులను పరామర్శించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. జిల్లా ఆసుపత్రులను సూపర్‌ స్పెషాలిటీగా, ఉస్మానియా, గాంధీలను రెండు వేల పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పడమే కానీ ఆచరణలో ముందడుగేయలేదని విమర్శించారు. వైద్యులు, ఫార్మాసిస్టులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు సేవా సప్తాహలో భాగంగా రోగులను పండ్లు పంపిణీ చేశారు. ఫీవరాసుపత్రి ఆర్‌ఎంఓ డా.పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంఒ డా.రేణుక, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహాయాదవ్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గౌతంరావు తదితరులు పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభం’
గన్‌ఫౌండ్రీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పతనం ప్రారంభమైందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. భవిష్యత్‌లో భాజపా విజయ పరంపర కొనసాగనుందని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి, మీడియా కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వి.సుధాకర్‌శర్మతో కలిసి మాట్లాడారు. భాజపా ఒత్తిడికి భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబరు 17పై తన వ్యవహారశైలి మార్చుకున్నారని, ఇది తెలంగాణ భాజపా విజయమని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.