close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

24 నుంచి 7వ ఆర్థిక గణన


మాట్లాడుతున్న ముఖ్య ప్రణాళికశాఖ డీడీ రమణప్ప

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో 7వ ఆర్థిక గణనను సమర్థంగా నిర్వహించాలని ముఖ్య ప్రణాళికశాఖ డీడీ సి.వి.రమణప్ప అన్నారు. కలెక్టరేట్‌లోని ముఖ్య ప్రణాళికశాఖ కార్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు, ఉప గణాంకాధికారులు, సహాయ గణాంకాధికారులకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, దుకాణాలు తదితరాలకు సంబంధించి 24వ తేదీ నుంచి గణన చేపట్టాలన్నారు. ఈ గణనను కామన్‌ సర్వీస్‌ కేంద్రాల నిర్వాహకులు ఆండ్రాయిడ్‌ చరవాణిలో యాప్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉందన్నారు. ఆర్థికపరమైన అంశాలన్నింటినీ ఈ సర్వేలో నమోదు చేయాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు శ్రీనివాసులు, పరమేశ్వరరావు, సతీష్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గణన విధానాన్ని వివరించారు. ఈ శిక్షణలో ముఖ్య ప్రణాళికశాఖ ఏడీలు అశోక్‌కుమార్‌రెడ్డి, ఐ.జె.రఘురామయ్య, ఎస్‌వోలు బాలాజీ నాయక్‌, సతీష్‌, ఉప గణాంకాధికారులు, సహాయ గణాంకాధికారులు, సీఎస్‌సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.