close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

మిన్నంటే వేడుక.. ఆనందాల వేదిక

రామోజీ ఫిల్మ్‌ సిటీలో పండగ సంబరాలు
ప్రత్యేక వినోదాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: దసరా, దీపావళి పండగ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ప్రత్యేక సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబరు 10వ తేదీ వరకు నిర్వహించనున్న కార్నివాల్‌ పర్యాటకులను సందడి చేయనుంది. సెలవు రోజుల్లో ఆకట్టుకొనే వినోదాలు ఇందులో విశేషం. ప్రకృతి రమణీయ రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు మిరుమిట్లగొలిపే వెలుగుల్లో మరింత వన్నెలీనుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఆబాలగోపాలం ఆనందడోలికల్లో తేలియాడుతూ రామోజీ ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతున్నారు.

సకుటుంబ సమేతం..
ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఉర్రూతలూగించిన బాహుబలి సినిమా చిత్రీకరించిన అద్భుత సెట్టింగ్‌లను కళ్లారా వీక్షించే అరుదైన అవకాశం రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకులకు లభిస్తుండటంతో వారిలో ఆనందం మిన్నంటుతోంది. ఇక్కడి కెఫే బాహుబలిలో బహుబలి, దేవసేన బిర్యానీ; మాహిష్మతి పరాటా, కట్టప్ప పూరీ, బల్లాలదేవ దోశ, అవంతిక జిలేబి తదితర రుచికరమైన వంటకాలు సందర్శకులకు నోరూరిస్తున్నాయి. తీర్చిదిద్దిన కార్నివాల్‌ పరేడ్‌, ప్రకృతి అందాలతో సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు, కిలకిలరావాల బర్డ్‌ పార్కు, సీతాకోక చిలుకల పార్కుతో పాటు ఫండుస్థాన్‌, బోరసుర, యురేకా షాపింగ్‌ ప్రాంతంతో పాటు ఎన్నెన్నో రైడ్స్‌, స్టంట్‌ షోలు రామోజీ ఫిల్మ్‌ సిటీ సందర్శనను మరుపురాని మధుర జ్ఞాపకంగా మారుస్తున్నాయి. సకుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో సందర్శకులు ఆస్వాదిస్తున్నారు.

సందర్శనకు ప్యాకేజీలు.. రామోజీ ఫిల్మ్‌సిటీలో కనులపండువగా సాగుతున్న దసరా, దీపావళి ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకోవాలనుకొనే వారి కోసం ఎన్నెన్నో ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. డే టూర్‌ ప్యాకేజీతో పాటు పలు ప్రీమియం ప్యాకేజీలున్నాయి. రామోజీ ఫెస్టివ్‌ స్టార్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్యాకేజీ, రామోజీ ఫెస్టివ్‌ నూన్‌ ఫిస్టా ప్యాకేజీ, రామోజీ ఫెస్టివ్‌ ట్విలైట్‌ ప్యాకేజీ ఇలా అందుబాటులో ఉన్న ప్యాకేజీలలో అనువైనది ఎంచుకొని పండుగల వేళ పసందైన వినోదాన్ని ఆనందించొచ్చు.

విడిదికీ అవకాశం..
రామోజీ ఫిల్మ్‌సిటీలో పండుగ సంబరాలను ఆస్వాదించాలనుకొనే పర్యాటకులకు విడిది ప్యాకేజీలను సైతం అందుబాటులో ఉంచారు. ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి వేడుకలలో పాలుపంచుకోవచ్చు. లగ్జరీ హోటల్‌ సితారలో, కంఫర్ట్‌ హోటల్‌ తార, వసుంధర విల్లాలో, ఫాంహౌస్‌లలో, శాంతినికేతన్‌, గ్రీన్‌ ఇన్‌, సహారా తదితరాల్లో బస చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రెండు, అయిదు రాత్రులు బస చేసేందుకు ప్యాకేజీలున్నాయి.

మరిన్ని వివరాలకు..
* హైదరాబాద్‌ : 95151 08472, 80080 35525
* రంగారెడ్డి జిల్లా : 93913 64912, 93944 89152
టోల్‌ ఫ్రీ నంబరు : 1800 120 2999,
www.ramojifilmcity.com లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.