close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

మూడో దశకు మూడింది!

కృష్ణా పైపులైనుకు లీకులు

క ప్రాంతంలో పైపుల లీకేజీ ఉంటే వాల్వులు విప్పి నీటిని మొత్తం బయటకు తోడాలి. కానీ దీనివల్ల భారీగా శుద్ధి చేసిన జలం వృథా అవుతుంది. గతంలోనూ తుర్కయాంజాల్‌్ సమీపంలోని మాసబ్‌చెరువు వద్ద స్కవర్‌ వాల్వు విప్పి 12 గంటల పాటు నీటిని వదిలేయాల్సి వచ్చింది

ఈనాడు, హైదరాబాద్‌: పట్టుమని అయిదేళ్లు పూర్తికాకముందే కృష్ణా మూడో దశ పైపులైన్‌ నుంచి తాగునీరు వృథాగా పోతోంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో వాల్వులు, వెల్డింగ్‌ల వద్ద పైపులకు కన్నాలు పడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అసలు ప్రారంభించిన తొలిఏడాదిన్నరలోనే లోపాలు కనిపించాయి. ప్యాకేజీ-1లో లీకేజీలు బయటపడటంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవగా నాడు అధికారులు సరిచేశారు.

నాడే ఆరోపణలు.. తొలుత రూ.1670 కోట్లతో పనులు చేపట్టారు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే నాటికి వ్యయం పెరిగింది. నాడు వాల్వులు, పైపులకు చేపట్టే కాంక్రీట్‌, సిమెంట్‌ కోటింగ్‌, వెల్డింగ్‌ పనులు, పైపులైన్‌ మందంపై ఆరోపణలు రాగా అధికారులు ఖండించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడో ఒక చోట లీకేజీలు సహజమని సూత్రీకరించడం గమనార్హం.

వాల్వుల వద్దే లీకేజీ.. కృష్ణా పైపులైన్‌లో పలు చోట్ల వాల్వుల వద్దే లీకేజీలు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 34 కిలోమీటర్ల పరిధిలో వినియోగించిన వాల్వుల నాణ్యతపై సందేహాలు ముసురుకున్నాయి. గొట్టపు మార్గంలో లైన్‌, ఎయిర్‌, స్కవర్‌ వాల్వులని మూడు రకాలుంటాయి. తాగునీటిని తరలించేందుకు ఇవి ఎంత ముఖ్యమో.. పైపులకు మరమ్మతు చేయాల్సి వచ్చినా అంతే కీలకం. చాలా ప్రాంతాల్లో నాసిరకానివి ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తలెత్తిన లీకేజీలు దానిని రూఢీ చేస్తున్నాయి.

23, 24 తేదీల్లో నీటి సరఫరా బంద్‌
పైపులైన్ల లీకేజీ నివారణలో భాగంగా ఈనెల 23న ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 వరకు పలుచోట్ల సరఫరా నిలిపివేస్తున్నారు. సాహెబ్‌నగర్‌, ఆటోనగర్‌, వైశాలినగర్‌, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ, బుద్వేల్‌,హైదర్‌గూడ, గోల్డెన్‌హైట్స్‌, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్‌పేట్‌, ప్రశాసన్‌నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్‌, చెంగిచర్ల, పీర్జాదిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, లాలాపేట, స్నేహపురి కాలనీ ప్రాంతాల్లో సరఫరా ఉండదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.