close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

నగరం నుంచి ఎగరాల్సిందే!

 దుండిగల్‌లో ప్రాథమిక, హకీంపేటలో యుద్ధ విమానాల పైలెట్ల శిక్షణ
నేడు భారతీయ వాయుసేన దినోత్సవం
ఈనాడు, హైదరాబాద్‌

దేశ రక్షణలో వాయుసేన అత్యంత కీలకం. సుశిక్షితులైన సైనికాధికారులుగా వాయుసేనలో చేరాలంటే తొలుత దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలోనే ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోవాలి. ఎన్‌డీఏ గ్రాడ్యుయేషన్‌ అనంతరం, ఇతర ఎంపిక పద్ధతిలో ఇక్కడ చేరే వాయుసేన, నేవీ, ఆర్మీ క్యాడెట్లను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. అక్టోబరు 8న భారతీయ వాయుసేన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని వాయుసేన ఆకాడమీపై ప్రత్యేక కథనం.

ఆసియాలోనే అత్యుత్తమం
పైలట్‌ శిక్షణలో దుండిగల్‌లోని వాయుసేన అకాడమీ ఆసియాలోనే అత్యుత్తమం. ఏటా పైలెట్లకు 18 వేల గంటల పాటు గగనతలంలో శిక్షణ ఇస్తోంది. వాతావరణం సరిగా లేనప్పుడు మినహా నిత్యం సగటున 50 గంటలపాటు ఇక్కడ శిక్షణ విమానాలు గాల్లో ఎగురుతు ఉంటాయి. మొదటి దశ పైలెట్‌ శిక్షణ విజయవంతంగా పూర్తిచేస్తే.. రెండో దశ శిక్షణను హకీంపేటలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో అందజేస్తారు. ఇక్కడ జెట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఉంది. ఆరునెలలు యుద్ధ విమానాలను నడిపే శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత మూడో దశలో బీదర్‌లో శిక్షణ ముగిశాక ట్రైనీగా వాయుసేనలో చేర్చుకుంటారు.


శిక్షణ ఇలా..

పైలెట్‌కు మొదట 9 గంటల పాటు అత్యాధునిక సిమ్యూలేటర్‌లో శిక్షణ ఉంటుంది. గాలిలో టెకాఫ్‌ అవుతున్నట్లుగా ఉంటుంది. తర్వాత 55 గంటలు  గగనతనంలో శిక్షణ ఇస్తారు.
అత్యాధునిక, సురక్షిత పిలాటస్‌ పీసీ7 ఎంకే-2 విమానాలతో శిక్షణ అందిస్తున్నారు. ఇంతకుముందు కిరణ్‌, హెచ్‌పీటీ-32 ఉండేవి. వీటి స్థానంలో 2013 నుంచి పిలాటస్‌ విమానాలు స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు.
గతంలో ప్రమాదకర పరిస్థితుల్లో పైలెట్‌ ప్రాణాలకు ముప్పు ఉండేది. కొత్త శిక్షణ విమానంలో పైలెట్‌ బయటపడే వ్యవస్థ ఉంది. నిర్దేశిత మీట నొక్కగానే పైన ఉండే గ్లాస్‌ను ఏజెక్షన్‌ సీటు బద్దలు చేసి దాంతోపాటూ ప్యారషూట్‌ తెరుచుకుని పైలెట్‌ సురక్షితంగా కిందకు చేరుతారు.
గతంలో పోలిస్తే శిక్షణ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేశామో తెలుసుకునేందుకు 60 జీబీ పెన్‌డ్రైవ్‌ లాంటివి శిక్షణ పైలెట్లకు ఉపయోగపడుతున్నాయి.

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అయినా..
భారతీయ వాయుసేనలో కింది స్థాయి నుంచి పై అధికారి అధికారి వరకు ప్రాథమిక శిక్షణ ఇక్కడే మొదలెట్టాల్సిందే. కఠోరమైన   శిక్షణలో రాటుదేలాల్సిందే. శత్రువులతో పోరాడేందుకు స్వీయరక్షణకు సైన్యంలో మాదిరి శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరేడ్‌,    బరువులతో కిలోమీటర్లు పరుగెత్తడం, షూటింగ్‌, ఈత, కర్రసాము, అడవుల్లో క్యాంపులు తదితర పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి.

అత్యుత్తమ శిక్షణ

- ఎయిర్‌ మార్షల్‌ ఎ.ఎస్‌.బుటోలా, కమాండెంట్‌, దుండిగల్‌ వాయుసేన అకాడమీ
అకాడమీలో ఆరు నెలలకు ఒక బ్యాచ్‌ శిక్షణ ఉంటుంది. ప్రస్తుతం అకాడమీలో 296 మంది శిక్షణ పొందుతున్నారు. పైలెట్లు, యుద్ధ పైలెట్లు శిక్షణలో ఉన్నారు. వాయుసేన, ఆర్మీ, నౌకాదళంతో పాటూ హెచ్‌ఏఎల్‌, పొరుగు దేశాలకు చెందిన క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాం.

యుద్ధ పైలట్‌గా..
- సమర్థ్‌ శుక్లా, పైలట్‌ ట్రైనీ
నేను తొలిదశ పైలెట్‌ శిక్షణ పూర్తి చేసుకుని రెండో దశ శిక్షణలో ఉన్నాను. తొలి ఆరు నెలల్లో మన సామర్థ్యాలు, ఆసక్తిని బట్టి రెండో దశలో రవాణా, హెలికాఫ్టర్‌, యుద్ధ పైలెట్ల శిక్షణకు ఎంపిక చేస్తారు. నేను యుద్ధ పైలెట్‌గా శిక్షణ పొందుతున్నాం.

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.