close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

దూరం.. మరింత భారం!

మూడో రోజూ ఆర్టీసీ సమ్మె ప్రభావం
సోమవారం సాయంత్రం వరకూ ఇదీ పరిస్థితి
ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి వెళ్లిన బస్సులు 1950
టీఎస్‌ఆర్టీసీ బస్సులు 152
అద్దెకు తిరుగుతున్న బస్సులు 131
ట్యాక్సీలు 2150


ఈనాడు, హైదరాబాద్‌

ఆర్టీసీ సమ్మె కష్టాలు కొనసాగుతున్నాయి. వెళ్లడానికి వాహనం దొరికినా.. ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె ఆగుతుందో.. మరింత ఉద్ధృతమవుతుందో తెలియని గందరగోళంలో నగర ప్రయాణికులు పండగ ప్రయాణాలను చాలావరకూ రద్దు చేసుకున్నారు.కొందరు మాత్రం వరుసగా మూడో రోజూ ప్రైవేటు వాహనదారుల దోపిడీకి గురయ్యారు.   బస్‌ పాస్‌ రాయితీలకు అవకాశమే లేకుండా.. టిక్కెట్‌ ఇవ్వకుండానే.. ఆర్టీసీకి అద్దెకు తిరుగుతున్న బస్సులతో పాటు.. ఆర్టీసీ సొంత బస్సుల్లోనూ ప్రయాణికులు దోపిడీకి గురయ్యారు.

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ ప్రాంగణాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో పాటు.. ఆర్టీసీకి అద్దెకు తిరిగే బస్సులు, ఆర్టీసీ సొంత బస్సులు ఇలా ప్లాట్‌ఫారాలన్నీ నిండిపోయాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులు దగ్గరుండి బస్సుల్లోకి ప్రయాణికులను పంపారు. స్కూల్‌ బస్సులు, పెళ్లిళ్లకు వేసే బస్సులు, కళాశాలలకు చెందిన బస్సులు నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి అందుబాటులోకి వచ్చాయి. కార్లు, ట్యాక్సీలు రోడ్డెక్కాయి.

బస్సులున్నా.. సాగని ప్రయాణాలు..

ఎంజీబీఎస్‌లో అన్నిరకాల బస్సులున్నా ప్రయాణికులు లేని పరిస్థితి నెలకొంది. దసరా పండగకి ఇప్పటికే చాలామంది ఊళ్లకు చేరుకోవడంతో సోమవారం ప్రయాణికులు పెద్దసంఖ్యలో కన్పించలేదు. ఆర్టీసీ సమ్మెపై స్పష్టత లేకపోవడంతో చాలామంది సొంతవాహనాల్లో ఊరెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పట్టణాలకు వెళ్లే బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ వెళ్లే 550 బస్సులకు తోడు.. కేవలం 47 బస్సులే అదనంగా నడిపామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కిషోర్‌నాథ్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌కు చెందిన మొత్తం 283 బస్సులు తెలంగాణలోని దూర ప్రాంతాలకు వెళ్లాయని.. రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ చెప్పారు. ఇందులో ఆర్టీసీవి 152 ఉండగా.. అద్దెకు తిరుగుతున్న బస్సులు 131 ఉన్నాయి.

టిక్కెట్ల ఊసేలేదు
నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గత మూడు రోజులుగా వింత అనుభవాన్ని చవి చూస్తున్నారు. బస్సు ఎక్కగానే.. ఇంకా చెప్పాలంటే రిజర్వేషన్‌, టిక్కెట్‌ కేంద్రాల వద్ద బస్సు టిక్కెట్‌ కొనుక్కొని ఎక్కే ప్రయాణికులు గత మూడు రోజులుగా టిక్కెట్‌ లేకుండానే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎక్కడ దిగినా.. ఎక్కడెక్కినా ఒకటే టిక్కెట్‌ ధర. కరీంనగర్‌కు రూ.400.. వరంగల్‌కు రూ.300 ఆదిలాబాద్‌కు రూ.800 నిజామాబాద్‌కు రూ.600 ఇలా ధరలు నిర్ణయించి మరీ ప్రైవేటు వాహనదారులు దండుకుంటున్నారు.

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.