close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

సాయిసంస్థాన్‌ సేవలను విస్తరించాలి

 కేంద్ర హోంశాఖా సహాయమంత్రి కిషన్‌రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్‌, న్యూస్‌టుడే: దిల్‌సుఖ్‌నగర్‌ సాయిసంస్థాన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవాకార్యక్రమాలు అభినందనీయమని, సేవలను మరింత విస్తరించాలని కేంద్ర హోంశాఖా సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో ఆధునికీకరణ, భవనాల పునరాకృతి పనులకు మంగళవారం దసరా పండుగ రోజున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌నగర్‌ అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది సాయిబాబా ఆలయమన్నారు. నిత్యం సంస్థాన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదానం, ఉచిత వైద్యసేవలు ఎంతగానో ఆదరణ పొందుతున్నాయని, సంస్థాన్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. భవనాల ఆధునికీకరణ చేట్టడంపై ట్రస్టు సభ్యులను మంత్రి అభినందించారు. అనంతరం ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ.. వచ్చే దసరా నాటికి ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవం కూడా మీ చేతులమీదుగానే జరగాలని మంత్రిని కోరడంతో.. ఆయన తప్పకుండా అంటూ హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్‌ భవానీప్రవీణ్‌, సంస్థాన్‌ ఛైర్మన్‌ గంగాధర్‌, వైస్‌ ఛైర్మన్‌లు నర్సింహగుప్త, శంకర్‌రావు, లక్ష్మణ్‌రావు, నాగేశ్వర్‌రావు, రాజుయాదవ్‌,  మల్లయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.