close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

మోదీ విధానాలతో ఆర్థిక పరిస్థితి కుదేలు

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ

నారాయణగూడ, న్యూస్‌టుడే: మోదీ దూకుడు విధానాలు, అసమర్థ పాలన వల్లే దేశీయోత్పత్తి, ఉత్పాదక రంగం గణనీయంగా పడిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వామపక్ష పార్టీలు ఆదివారం నారాయణగూడ ఫ్లైఓవర్‌ కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని.. ఒక ఆటోమొబైల్‌ రంగంలోనే 3.5 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలను ఏకం చేసి బలమైన ఉద్యమాలు, పోరాటాలతో మోదీని గద్దె దింపడానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల నిత్యావసర సరకులు, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇ.టి.నరసింహా, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్‌.ఛాయాదేవి, పోతూ కళావతి, నగర నాయకులు ఎం.నరసింహా, మన్నాన్‌ సలీం ఖాన్‌, రాకేశ్‌సింగ్‌, నెర్లకంటి శ్రీకాంత్‌, సీపీఎం నేతలు ఎం.శ్రీనివాస్‌, కె.ఎన్‌.రాజన్న, కె.ఈశ్వర్‌, అరుణజ్యోతి, ఎం.దశరథ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.