close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

కొత్త కానిస్టేబుళ్లకు అభినందన సభ రేపు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణలో పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా ఎంపికైన అభ్యర్థులకు అభినందన సభను మంగళవారం నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 10 నెలలపాటు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో శౌర్య అకాడమీకి చెందిన ఫ్యాకల్టీలు, పోలీసు అధికారులు శిక్షణ ఇవ్వగా 700 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలు రాస్తే 280 మంది ఎంపికయ్యారు. వారిలో 110 మంది మహిళలున్నారు. ఈ నేపథ్యంలో వారిని అభినందిస్తున్నట్లు కమిషనర్‌ వివరించారు. అభ్యర్థులు 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.