close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

‘సినీ హైర్‌’ యాప్‌తో ఔత్సాహికులకు దిశానిర్దేశం: తలసాని

నారాయణగూడ: ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు ‘సినీ హైర్‌ యాప్‌’ దిశానిర్దేశనం చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో లఘుచిత్ర దర్శకుడు మానస్‌ దండ నాయక్‌ రూపొందించిన ‘సినీ హైర్‌ యాప్‌’ గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్‌ ఔత్సాహిక నటులతో పాటు దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత నాగబాల సురేశ్‌, సినిమాటోగ్రాఫర్‌ వంశీ, యువ నటుడు కల్యాణ్‌, అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.