close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

గుంతలు పూడ్చండి.. చింతలు తీర్చండి

నరకాన్ని తలపిస్తున్న ప్రధాన, అంతర్గత రోడ్లు
ప్రజల నడ్డివిరుగుతున్నా పట్టించుకోని బల్దియా

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంలో రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లను చూస్తే వెన్నులో వణుకుపుడుతోంది. పైవంతెనలపైనా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. మరమ్మతుల పేరుతో నిర్మాణ వ్యర్థాలతో గోతులు పూడ్చడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. వర్షంతో ఇసుక మేటలు, బురద గుంతలు ఏర్పడి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 9,100 కి.మీ రోడ్లున్నాయి. ఇందులో సుమారు 80 శాతం అంతర్గత రహదారులే. మిగిలినవి ప్రధాన రహదారులు. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. సెప్టెంబరుతోపాటు అక్టోబరులోనూ వర్షాలు భారీగా కురుస్తుండటం వల్ల అంతర్గత రోడ్లు సైతం పాడయ్యాయి. కాలనీల రోడ్లు పూర్తిగా ఛిద్రమయ్యాయి. మరమ్మతులు చేస్తున్నా కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో బస్తీలు, కాలనీల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్లపై నిండిన వరదలో ప్రయాణిస్తూ ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. వాహనాలూ దెబ్బతింటున్నాయి. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు చర్యలు తీసుకోవడంలేదు. మరమ్మతుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాలొస్తే రోడ్లు పాడవడం సహజమనే ధోరణిలో ఉండిపోతున్నారు. ఓ అంచనా ప్రకారం నగరవ్యాప్తంగా 60 శాతం రోడ్లు గుంతలతో నిండాయి. వాటిని పూడ్చుతున్నామంటూ అధికారుల ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేశారని, కానీ వారు మరమ్మతులు చేసిన మరుసటి రోజునే అక్కడ యథాస్థితి దర్శనమిస్తోందని పౌరులు ఆరోపిస్తున్నారు. తూతూ మంత్రంగా నాణ్యతలేకుండా చేస్తున్న పనులతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వాపోతున్నారు. జీహెచ్‌ఎంసీ గత రెండేళ్లుగా రహదారులకు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసింది. కొత్తగా నిర్మించిన రోడ్లు సైతం చిన్న వర్షాలకు కంకర తేలుతుండడం గమనార్హం. దీర్ఘకాలం మన్నేలా రోడ్ల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం నడుంబిగించాలని కోరుతున్నారు. రోడ్లు ఇలాగే ఉంటే సగం మంది నగర వాహనదారులు నడుమునొప్పికి గురవుతారు. రోడ్డు ప్రమాదాలూ పెరిగే అవకాశం ఉంది.

 

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.