close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

సడలని సమ్మె

 వంటావార్పులతో ఉద్యమ రూపం
 నిరసనతో దద్దరిల్లిన కంచన్‌బాగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రయాణికుల కష్టాలు యథాతథంగా కనిపించాయి. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుడల చేయగా.. ఆదివారం సమ్మెను ఉద్ధృతం చేశారు. నగరంలోని 29 డిపోల్లో ‘వంటా వార్పు’తో నిరసన తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి చికిత్స పొందిన కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి ఆర్టీసీ కార్మికనేతలు, కార్మికులు, విపక్ష నాయకులు ఆసుపత్రికి తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరలివచ్చిన కార్మికులను పోలీసులు వెంటవెంటనే అరెస్టు చేశారు. మృతదేహాన్ని చూసి నిరసన తెలపకుండా వెళ్లిన వారిని విడిచి పెట్టారు.

కార్మికులకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక వంటావార్పు నిర్వహించింది. ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మాహుతికి నిరసనగా కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

గాడిన పడని ప్రయాణాలు..సమ్మెతో తొమ్మిదో రోజూ ప్రయాణాలు గాడిన పడలేదు. ఆదివారం కావడంతో బస్సుల సంఖ్య తగ్గింది. హయత్‌నగర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వెళ్తున్న బస్సును డ్రైవర్‌ తాగిన మత్తులో అదుపుచేయలేక కారు, బైకును ఢీకొట్టగా ఒకరు గాయపడ్డారు. చివరికి విభాగిని ఢీకొట్టి 50 మీటర్లవరకూ వెళ్లి ఆగిపోయింది. మొత్తం 3550 బస్సులకు 920 మాత్రమే నడిచాయి.

‘అప్రజాస్వామిక విధానాలతోనే మరణాలు’
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలతోనే ఇప్పటివరకు ఐదుగురు ఆర్టీసీ కార్మికులు మరణించారని తెలంగాణ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. సమ్మెపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ఈ విషయంలో గవర్నర్‌ చొరవ చూపాలన్నారు.

 

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.