close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

10 వేల మంది.. రూ.1.44 కోట్లు

అపరిశుభ్రతకు కారకులైన వారికి గత 6 నెలల్లో వడ్డన
బల్దియా చరిత్రలో తొలిసారి
ఈనాడు, హైదరాబాద్‌

నగర వాతావరణాన్ని పాడుచేస్తూ బల్దియాకు పట్టుబడిన ఉల్లంఘనుల సంఖ్య పదివేల మార్కు దాటింది. రోడ్లపై వ్యర్థాలు పడేయడం నుంచి బహిరంగ మూత్ర విసర్జన, నిషేధిత ప్లాస్టిక్‌ సంచుల వినియోగం వంటి పలు అంశాల్లో మొత్తం 10,186 మంది నుంచి అధికారులు రూ.1.44కోట్లు వసూలు చేశారు. ఈ ముమ్మర జరిమానాలు కేవలం ఆరు నెలల కాలంలో విధించినవే. ఇన్ని వేలమందిపై చర్యలు తీసుకోవడం బల్దియా చరిత్రలో ఇదే మొదటిసారి. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకొచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరంలో పారిశుద్ధ్యం
అంతంతమాత్రం. ఎక్కడ చూసినా వ్యర్థాలు, చెత్తకుప్పలు, గోడలపై బహిరంగ మూత్ర విసర్జన, ఖాళీ ప్రదేశాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.  స్వచ్ఛ ఆటోలు పూర్తిస్థాయిలో కాలనీలకు వెళ్లట్లేదు. నగరంలో ప్రస్తుతం 1,600 ఆటోలు ఉంటే.. అందులో సుమారు 200 ఆటోలు రెండు, మూడు రోజులకోసారి చెత్త సేకరణకు వెళ్తున్నాయి. ఇష్టానుసారం రుసుము పెంచడంతో చాలామంది గృహస్థులు చెత్త ఇవ్వడం మానేస్తున్నారు. ఇలాంటి రకరకాల కారణాలతో నగరం చెత్తమయం అవుతోంది. దీంతో ఈయేడాది మే నెలలో ముమ్మర తనిఖీలకు అధికారులు శ్రీకారం చుట్టారు. సర్కిల్‌ ఉపకమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, జవాన్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఉల్లంఘనులను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. బల్దియా పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. జరిమానాల వసూలులో చందానగర్‌ సర్కిల్‌ రూ.22,78,300, శేరిలింగంపల్లి రూ.20,64,400, మూసాపేట రూ.11,43,650తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

మొదటి ర్యాంకు నుంచి అట్టడుగుకు..
సరిగ్గా రెండేళ్ల క్రితం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ స్వచ్ఛతతో, ఘన వ్యర్థాల నిర్వహణలో మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారు. చిన్నపాటి జరిమానాలకూ అధికారులు సాహసం చేయడంలేదు. మిగిలిన సర్కిళ్లు రూ.5 లక్షలకు చేరువలో ఉంటే.. రాజేంద్రనగర్‌ అధికారులు రూ.99వేలతో సరిపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.