close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

రైలు దిగాక.. ఇబ్బంది లేదిక

అద్దెకు కార్లు.. ద్విచక్ర వాహనాలు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైలు దిగగానే ప్రయాణికులు సులభంగా ప్రయాణించేందుకు ద్విచక్రవాహనాలతో పాటు, కార్లను దక్షిణ మధ్య రైల్వే సిద్ధంగా ఉంచింది. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వినియోగించుకోడానికి వీలుగా ‘డ్రైవజీ ఇండియా ట్రావెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ద్వారా ఈ వాహనాలను సిద్ధం చేసింది. వాటిని అద్దెకు తీసుకెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి తిరిగి స్టేషన్‌లోనే పెట్టేలా ఏర్పాట్లుచేశారు. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం-2 వైపున ఈ సదుపాయం కల్పించారు. డ్రైవజీ ఇండియా సంస్థకు అద్దెకు స్థలం ఇవ్వడంతో ద.మ. రైల్వేకు రూ. 4 లక్షల ఆదాయం ఏటా సమకూరుతుంది. ప్రస్తుతానికి హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించామని.. దశలవారీగా ముఖ్యమైన రైల్వే స్టేషన్లతో పాటు.. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతామని ద.మ. రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.