close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

తెలుగు చలన చిత్రోత్సవానికి ఏర్పాట్లు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌, శ్రీ సారథీ స్టూడియోస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే తెలుగు చలనచిత్రోత్సవానికి అన్ని సన్నాహాలూ చేస్తున్నట్లు క్లబ్‌ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అమీర్‌పేటలోని సారథీ స్టూడియోస్‌ ప్రీవ్యూ థియేటర్‌లో నాలుగురోజులు కొనసాగే ఈ వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తామన్నారు. 18వ తేదీన దొరసాని, 19న మల్లేశం, 20న కేరాఫ్‌ కంచెరపాలెం, 21న మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు..చిత్రాల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. అన్ని రోజులూ ఆ చిత్రాలకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.