close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

నగరానికి.. గోదావరి బంద్‌

నేటినుంచి 48 గంటల దాకా..
సగం ప్రాంతంపై తీవ్ర ప్రభావం
 ఈనాడు, హైదరాబాద్‌

నగర దాహార్తిని తీర్చడంలో కీలకమైన గోదావరి జలాల సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బుధవారం ఉదయం నుంచి 48 గంటలపాటు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దాదాపు 172 మిలియన్‌ గ్యాలన్ల నీటి తరలింపు ఆగిపోనుంది. ఈ ప్రభావం సగం నగరంపై పడనుంది. తొలుత మూడు రోజులపాటు నిలిపివేయాలని భావించినప్పటికీ..ప్రజల ఇబ్బందులను గుర్తించి రెండు రోజులకు తగ్గించారు. పేరుకు 48 గంటలైనా ఆ ప్రభావం నాలుగైదు రోజులపాటు ఉంటుంది. రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుండటమే దీనికి కారణం. తొలి రోజు నీళ్లు రానివారు మళ్లీ మూడు రోజుల వరకు నిరీక్షించాలి. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. ఇలాంటివారు ఆరు రోజులపాటు వేచి చూడాలి. 3-6 రోజులపాటు ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. నగరానికి ఇంతవరకు 460 మిలియన్‌ గ్యాలన్లను తరలిస్తున్నారు. కృష్ణా మూడు దశల నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి మరో 172 ఎంజీడీలు, మిగతా నీటిని జంట జలాశయాలనుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ-13లో భాగంగా గజ్వేల్‌ మండల పరిధిలోని కొడకండ్ల వద్ద గ్రావిటీ కెనాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.వీటికి 3000 ఎంఎం డయా గోదావరి పైపులైన్‌ అడ్డంకిగా మారింది. దీంతో కెనాల్‌పై నిర్మించిన వంతెన మీద నుంచి పైపులైన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ ఉదయం వరకు ఈ పనులు చేపట్టనున్నారు.

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు..  ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్‌, భాగ్యనగర్‌, భరత్‌నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ, ఎన్‌ఎఫ్‌సీ, పోచారం, సింగపూర్‌ టౌన్‌షిప్‌, మౌలాలి, లాలాపేట, తార్నాక, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, సూరారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌, పేట్‌బషీరాబాద్‌, డిఫెన్స్‌ కాలనీ, గౌతంనగర్‌, ప్రశాంత్‌నగర్‌, చాణక్యపురి, మల్కాజిగిరి, ఫతర్‌బాలాయినగర్‌, అల్వాల్‌, న్యూ ఓయూ కాలనీ, కైలాసగిరి, హఫీజ్‌పేట, మియాపూర్‌, మాతృశ్రీ నగర్‌, మయూరినగర్‌, చందానగర్‌, ఆర్సీపురం, పటాన్‌చెరు, బోలారం,  నిజాంపేట, ప్రగతినగర్‌, బాచుపల్లి, బొల్లారం, అమీన్‌పూర్‌, మల్లంపేట,  జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల, ఆర్‌జీకె, అహ్మద్‌గూడ, దేవరాయాంజల్‌, లాలాపేట, తార్నాక, సీఆర్‌పీఎఫ్‌ మెస్‌, కంటోన్మెంట్‌ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు.

నిమ్స్‌లో 3 రోజులు శస్త్రచికిత్సలు, ప్రవేశాలు బంద్‌
పంజాగుట్ట: గోదావరి లైన్ల మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం నేపథ్యంలో నిమ్స్‌లోనూ నీటి కొరత ఏర్పడనుండడంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు, ప్రవేశాలు నిలుపుదల చేస్తున్నట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ వెల్లడించారు.అత్యవసరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.