close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం 20న

కాచిగూడ, న్యూస్‌టుడే: నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 1980-83 విద్యా సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు సమ్మేళనం సమన్వయకర్త వెంపటి మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు చిల్కూర్‌ రెడ్డిపల్లి గ్రామంలోని రవిసింగ్‌ ఫామ్‌హౌస్‌లో సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబరు 98490 08911లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి. వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు

ముంబయి అంతే.. హైదరాబాద్‌ ఇంతే!

ప్రపంచంలోని వంద ప్రధాన నగరాల్లోని రహదారుల స్థితిగతులపై సర్వే నిర్వహిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి చివరి స్థానంలో నిలిచింది.. సగటు మనిషి ప్రయాణ వ్యయం, పెట్రోలు ధర, వార్షిక రహదారి పన్ను తదితర అంశాల్లో చిట్ట చివర నిలిచింది. యూరోపియన్‌కు చెందిన కారు విడి భాగాల విక్రయ సంస్థ ‘మిస్టర్‌ ఆటో’ ఈ సర్వే చేపట్టింది. వంద నగరాల్లో మొత్తంగా కెనడాలోని కల్గరీ నగరం తక్కువ వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల మరణాలు, సరసమైన ప్రయాణ వ్యయంతో ఉత్తమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ముంబయి రహదారులు బాగుంటాయని కితాబిచ్చిన నగర యంత్రాంగం, హైదరాబాద్‌ నగరం సర్వేలో ఉండి ఉంటే ఏ స్థానం దక్కేదో అంచనా వేసుకోవాలి. ప్రపంచ పర్యాటకులు భాగ్యనగరం వైపు చూస్తోన్న తరుణంలో..

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.