close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

చిత్రం... చెప్పే కథలు!

ప్రపంచానికి కావడ్‌ కళ పరిచయం
 కార్యశాలలు నిర్వహిస్తున్న విద్యార్థులు
ఆసక్తి చూపిస్తున్న నగర కళాకారులు
న్యూస్‌టుడే, హైదరాబాద్‌

ఒక చిత్రం.. వేయి పదాలకు సమానం. సామాన్యులకూ విజ్ఞానాన్ని పంచగల సాధనం. శతాబ్దాల క్రితం.. కళాకారులు తాము చెప్పదలచుకున్న అంశాలను చిత్రాల ద్వారా పంచుకునేవారు. ఒకప్పటి ఆ చిత్రరూపాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. తరాలు మారుతున్నకొద్దీ వాటిలో చాలా వరకు కనుమరుగవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాజస్థానీ విద్యార్థులు, కళాకారులు.. తమ ప్రజల జీవన విధానంలో భాగమైన ‘కావడ్‌’ కళను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశ, విదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ప్రాచీన కళను భావి తరాలకు అందించేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌, డిజైన్‌(ఐఐసీడీ, జైపూర్‌) యూనివర్సిటీ వారు నగరంలోని లామఖాన్‌లో ఇటీవల శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారిని పలుకరించినపుడు.. కళను బతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించారు.

విదేశీయులు ఫిదా..
దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొన్న విదేశీయులు కావడ్‌ కళపై ఆసక్తి చూపుతూ వాటి తయరీలో సైతం శిక్షణ పొందేందుకు ఆసక్తిచూపుతున్నారు. కళల పట్ల ఆసక్తి ఉన్న స్వదేశీ విద్యార్థులు తమ సృజనతో కావడ్‌కు కొత్త హంగులు అద్దాలని భావించడం మరో విశేషం.

భళా.. జానపద కళ
తెలుగునాట బుర్ర కథలలు, హరికథలు, తోలుబొమ్మలాటలు.. ప్రజలకు వినోదం, విజ్ఞానాన్ని పంచిన సంప్రదాయ కళలు. ఇదే కోవలో రాజస్థాన్‌ జానపద కళల్లో ఒకటి కావడ్‌. కావడ్‌ అంటే చెక్కబొమ్మ, తలుపు రెక్క అని అర్థం. వాటిపై అందంగా చెక్కిన శిల్పాలు.. గీసిన చిత్రాలతో కళారూపాలు తయారుచేస్తారు. మహాభారతం, రామాయణం, భాగవతం వంటి పురాణ ఇతిహాసాల చిత్రాలను వరుసగా రూపొందిస్తారు. వాటిపై గీసిన చిత్రాల ఆధారంగానే పురాణాలు, రాజుల కథలు, పురాణాలను వివరిస్తారు. కథా సారాంశాన్ని క్లుప్తంగా వివరించేందుకు కవాడ్‌ కళలో వెసులుబాటు ఉంటుంది. ఈ బొమ్మలపై రాతలు ఉండవు. కేవలం చిత్రాల ఆధారంగా వాటి ప్రత్యేకతను సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఛార్‌పాయ్‌(మంచం)లను విభిన్న ఆకృతుల్లో ఇక్కడివారు తయారు చేస్తారు.

శతాబ్దాల అనుబంధం
కావడ్‌ల తయారీలో కలపతో పాటు కాటన్‌, ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాల ప్రత్యేకతను చాటేందుకు వీటిని రూపొందిస్తారు. దాదాపు నాలుగు వందల ఏళ్ల కిందటి నుంచే రాజస్థాన్‌లోని మెవర్‌ జిల్లా బస్సీ, చిట్టర్‌ఘర్‌, జైసల్మెర్‌ ప్రాంతాల్లో వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జైసెల్మర్‌ ప్రాంతం వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించి పాటల రూపంలో వాటి అవశ్యకతను ప్రజలకు వివరించేవారు. 400 సంవత్సరాల నాటి కళారూపాలకు అక్కడ ఇప్పటికీ డిమాండ్‌ ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేప్పుడు.. కవాడ్‌ కథకులను రప్పించి మరీ పురాణ కథలను చెప్పించుకుంటారు.

అవగాహనతో ఆసక్తి పెంపు
నగరంలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో ఇక్కడి యువతకు ఉచితంగా అవగాహన కల్పించారు. కావడ్‌ల తయారీలో చిట్కాలను వివరించారు. కెరీర్‌గా మలుచుకుంటే స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయని వివరించారు. ‌
www.iicd.ac.in వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. కావడ్‌, చార్‌పాయ్‌లు తయారీతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, ఈ ఉత్పత్తులను ఎక్కువ మంది ఆదరిస్తున్నారని వారు తెలిపారు. హైదరాబాద్‌ కళాకారుల ప్రోత్సాహం మరువలేదని వారు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.