close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. తెరాస పతనానికి నాంది

హయత్‌నగర్‌లో సమ్మెకు విపక్షాల మద్దతు
 వినూత్న నిరసనలు.. రాస్తారోకో.. వంటావార్పు

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మంగళవారం హయత్‌నగర్‌ బస్‌డిపో వద్ద ఆందోళనను తీవ్రతరం చేశారు. డిపో నుంచి బస్సులను బయటకు వెళ్లనీయకుండా ఉదయాన్నే డిపోగేటు ముందు బైఠాయించారు. రెండు గంటలకు పైగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనను కొనసాగించారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై సహపంక్తి భోజనాలు చేశారు. కార్మిక సంఘాల ఐకాస నాయకులు శంకరయ్య, పి.నర్సింహ, పి.మల్లేష్‌ మాట్లాడుతూ... కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వమే దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, హయత్‌నగర్‌ మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె తెరాస సర్కారు పతనానికి నాంది అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాజేయాలని సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కళ్లెం రవీందర్‌రెడ్డి, బండారి భాస్కర్‌, నవజీవన్‌రెడ్డి, కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు.

వైజంక్షన్‌లో ఆర్టీసీ కార్మికుల మానవహారం
మూసాపేట, న్యూస్‌టుడే: మూసాపేట వైజంక్షన్‌లో ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్మికులకు సంఘీభావంగా వచ్చిన విపక్ష నేతలు సైతం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అయితే కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు వారిని వారించారు. అనంతరం అక్కడి నుంచి డిపో మీదుగా మూసాపేట మెట్రో స్టేషన్‌ వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ముఖ్యమంత్రి తన మొండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కార్పొరేటర్‌ పన్నాల కావ్యారెడ్డి, డిపో ఐకాస నేతలు డి.ఎం.రెడ్డి, వీఎల్‌రెడ్డి, ఎస్‌.అశోక్‌, ఎం.అయిలయ్య, శ్రీనివాస్‌, అక్బర్‌, లక్ష్మయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మస్థైరం కోల్పోవద్దు: బీవీ రాఘవులు
కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర మరువలేనిదని సీపీఎం జాతీయ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం కంటోన్మెంట్‌ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బోయిన్‌పల్లి హమాలీ యునియన్‌ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో హమాలీలు చేసిన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, గ్రేటర్‌ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహులు మాట్లాడారు. కార్మికుల పోరాటాలతో వచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రస్తుతం అదే కార్మికులను అణచివేసేందుకు ప్రయత్నిస్తుండడం బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.