close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

మరోసారీ!!

ఈ ఏడాది తరగతులు లేనట్లే?

గిరిజన యూనివర్సిటీ నిర్వహణపై నీరుగారుతున్న ఆశలు

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లాకు మణిహారంగా భావిస్తున్న గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రహణం పట్టింది. మరోసారి కూడా తరగతులు లేనట్లేననేది స్పష్టమవుతోంది. మొదటి సెమిస్టర్‌ విద్యా సంవత్సరం గడువు ముగియడంతో తరగతుల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఇక వచ్చే సంవత్సరమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నుంచే క్లాసులు నిర్వహిస్తామని కేంద్ర విశ్వవిద్యాలయ అధికారులు చెబుతున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. గత సెప్టెంబరులో నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని అందరూ భావించారు. దాని ఊసే కానరాలేదు. దీనిపై స్పష్టత ఇచ్చేవారు కొరవడ్డారు. యూనివర్సిటీ ఏర్పాటులో భాగంగా అత్యవసరంగా భవనాల నిర్మాణానికి రెవెన్యూ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖకు సుమారు 150 ఎకరాల స్థలం కూడా అప్పగించింది. తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ములుగు మండలం జాకారంలోని యువజన శిక్షణ కేంద్రాన్ని కూడా ఇచ్చింది. తగిన వసతులు కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సన్నహాలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. తరగతుల నిర్వహణకు జరుగుతున్న జాప్యానికి గల కారణాలేమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పర్యవేక్షణలో గిరిజన విశ్వవిద్యాలయం వ్యవహరాలు చూసుకుంటూ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడి అధ్యాపకులు ఇక్కడికి కావడం కష్టంగా మారుతుందనే అభిప్రాయంతో తరగతుల నిర్వహణను వాయిదా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం వివిధ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలోనే కొంతకాలం తరగతులు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఈ సారి తరగతులు లేవు: బాలు, డీఈ, ఐటీడీఏ

ఈ సారి గిరిజన యూనివర్సిటీ తరగతులు జరిగే అవకాశం లేదు. వచ్చే విద్యా సంవత్సరం జరిగే అవకాశాలున్నాయి. ఇందుకు గాను యువజన శిక్షణ కేంద్రం భవనాన్ని రూపుదిద్దేందుకు కొన్ని అంచనాలు తయారు చేసి ప్రతిపాదించాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.