close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

కల్కి ఆశ్రమంలో గుట్టలుగుట్టలుగా నగదు
రెండోరోజూ ఐటీ దాడులు ●
పలు కీలకపత్రాలు, హార్డ్‌ డిస్కుల స్వాధీనం

రూ.10 కోట్ల వరకు విదేశీ, స్వదేశీ కరెన్సీ .. బంగారు బిస్కెటు కూడా?

ఏకం ఆలయం వద్ద సిబ్బందిని సైతం అనుమతించని సెక్యూరిటీ

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే : వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమమైన ఏకం ఆలయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు ఐటీశాఖ అధికారులు రెండురోజులుగా మండలంలోని బత్తులవల్లం, ఉబ్బలమడుగు సమీపంలో ఉన్న ఏకం ఆలయం, విడిది గృహాలలో మకాం వేశారు. వాటిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని మినహా నిర్వాహకులను, దాసాజీలను ఏ ఒక్కరినీ బయటకు అనుమతించ లేదు. బయటి వారిని కూడా లోపలికి అనుమతించకుండా ఆశ్రమాన్ని దిగ్బంధించారు. ప్రధాన నిర్వాహకులైన లోకేష్‌దాసాజీ, శ్రీనివాస దాసాజీలను అధికారులు వేర్వేరుగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆశ్రమంలో పనిచేసే దాసాజీలను సైతం వేర్వేరుగా పలు ప్రశ్నలతో ముంచెత్తారని సమాచారం. ఉబ్బలమడుగు సమీపంలో ఒకనాడు కల్కి భగవాన్‌ నివాసం ఉన్న వన్నెస్‌ క్యాంపస్‌-3లోనే (ఏకం ఆలయం) ప్రధానంగా భారీసంఖ్యలో అధికారులు మకాం వేశారు. వరదయ్యపాళెంలో కల్కి ట్రస్టు ఏర్పాటుచేసిన గత 25 ఏళ్లలో ట్రస్టు పేర్లను తరచూ మారుస్తుండటంలో ఆంతర్యం ఏమిటని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలా ఒక్కో పేరు మీద ఏర్పాటైన ట్రస్టు సంస్థల పేరిట వచ్చిన నిధులు, వాటితో ఏఏ ఆస్తులు ఆర్జించారు..నిధులను దేనికి మళ్లించారు..ఎక్కడెక్కడ భూములున్నాయనే విషయమై పలు కీలకపత్రాలనే కాకుండా ఆశ్రమంలో జరిగే కార్యకలాపాలకు సంబంధించిన హార్డ్‌ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిని శుక్రవారం చెన్నైకు తరలించే అవకాశం ఉంది. ఐటీ దాడులు మొదలవగానే ట్రస్టు కార్యకలాపాలకు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన సుమారు రూ.45 లక్షలను అధికారుల కళ్లుగప్పి ఆశ్రమం నుంచి ఓ వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా దాటిస్తుండగా, వారు పసిగట్టి నగదును స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

● రెండోరోజు గురువారం ఐటీ అధికారులు పలు కీలకపత్రాలు, రికార్డులు, హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకుని వాటిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో, ఓ దాసాజీ వ్యవహరించిన తీరు కారణంగా నగదును దాచే కీలకప్రదేశాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రదేశాన్ని తనిఖీ చేసిన అధికారులు నిర్ఘాంతపోయినట్లు తెలిసింది. అందులో అధికసంఖ్యలో బంగారు బిస్కెట్లు, సుమారు రూ.10 కోట్ల వరకు స్వదేశీ, విదేశీ నగదు దొరికినట్లు సమాచారం. అయితే అధికారులు దీనిపై పెదవి విప్పడం లేదు. పూర్తి సమాచారాన్ని చెన్నైలోని ఉన్నతాధికారులే వెల్లడిస్తారని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.