close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

విపణిలో పెళ్లి సందడి

కరీంనగర్‌ వాణిజ్యం, న్యూస్‌టుడే : పెద్ద పండుగలు ఘనంగా ముగిశాయి. అదే స్థాయిలో విపణిలో క్రయవిక్రయాలు జరిగాయి. ఇది వివాహాల సీజన్‌.. ఆపై వెలుగుల దీపావళి.. సందర్భం ఏదైనా వినియోగదారులను ఆకట్టుకోవడమే వ్యాపారులు ప్రధాన లక్ష్యం.. మార్కెట్‌ అందించే ఆఫర్లను సొమ్ము చేసుకోవడమే వినియోగదారుల ఆశయం.. అందుకే ప్రస్తుత మార్కెట్‌లో సందడి నెలకొంది. వివాహాది శుభకార్యాలు గల కుటుంబాలు కొనుగోళ్లకు ఉపక్రమించాయి. ఎలాగైనా కొనుగోలు చేయాల్సిన నేపథ్యం.. పైగా ఆఫర్లు, రాయితీల హోరు.. సద్వినియోగం చేసుకోవడం కోసం ముందుకొస్తున్నారు. దీనికితోడు విద్యా సంస్థలకు సెలవులు కావడంతో ఇంటిళ్లిపాది షాపింగ్‌కు సై అంటున్నారు. పెళ్లి అంటే.. ఎన్నో కొనుగోలు చేయాలి. అందులో ప్రధానమైనవి వస్త్రాలు, దుస్తులు.. ఆ తర్వాత గృహోపకరణాలు. అంటే లాంచనాలు.. ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న దీపావళి నేపథ్యంలో వ్యాపారులు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉన్నారు. అవి వినియోగదారులను ఊరించడంతో మార్కెట్‌కు కొనుగోళ్ల కళ వచ్చింది. బతుకమ్మ, దసరా పండుగల తర్వాత శుభముహూర్తాలు రావడం వ్యాపారులకు కలిసి వస్తోంది. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఆత్రం పెరిగింది. పోటీ నేపథ్యంలో కొనుగోలుదారులకు చేరువ అయ్యేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇప్పటివరకు ఊరించిన ఆఫర్లకు మించి అందివ్వాలనే ఆలోచనలో వ్యాపారులు వ్యూహరచన చేస్తున్నారు. పండగ నేపథ్యంలో ఆఫర్లను అందుకున్న వినియోగదారులు మరిన్ని రాయితీల కోసం వేచి చూస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒకరిని మించి మరొకరు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వివాహాలతో పాటు రానున్న పండుగ పూట వినియోగదారులే లక్ష్యంగా వ్యాపారులు ఆఫర్ల ప్రకటనలో ప్రత్యేక వ్యూహం రచించి అమలు చేస్తున్నారు. ఇది వినియోగదారులకు భారీగానే కలిసి వస్తోంది. ఆఫర్లు ఉండగానే సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటం కొనుగోలు దారుల్లో స్పష్టం అవుతోంది. గతానికి మించి అమ్మకాలు సాగించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అన్ని వర్గాలకు చేరువయ్యే ఆఫర్లను అందిస్తున్నారు. అటు వస్త్ర దుకాణాలు, మెన్స్‌వేర్‌, టేలర్‌ మేడ్‌తో పాటు ఇటు హోం అప్లియేన్స్‌ ఇంటికి కొత్త శోభను ఇచ్చేందుకు సిద్ధం. వివాహాల సందర్భంగా ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎక్కువే.. అందుకే సంబంధిత మార్కెట్‌ ఆఫర్లతో సిద్ధంగా ఉంది. విపణి అందించే ఆఫర్లను సొంతం చేసుకోవాలనే ఆరాటం పైగా సెలవులు రావడంతో రోజురోజుకు అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచి కలిసి వచ్చే ప్రతి ఆఫరు, డిస్కౌంటును సొంతం చేసుకునేందుకు పోటీ పడుతూనే ఉన్నారు. పండగల తర్వాత వివాహాది శుభకార్యాల సీజన్‌.. రానున్న పండగలకు కొత్త దుస్తులు, చీరలు, పిల్లలకు దుస్తులు, కొనుగోలు చేయడం తెలిసిందే.. ఇక ఆఫర్లు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లోనే సద్వినియోగం చేసుకోవడం ఖాయం. కొంత కాలంగా ఆఫర్లతో అదరగొడుతున్న వ్యాపారులు ఇప్పుడు మరింత జోరు పెంచారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.