close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్షాల ఆందోళన

భగత్‌నగర్‌(కరీంనగర్‌) : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. మంత్రి ఇంటి ముట్టడితోపాటు కలెక్టరేట్‌ ముందు దీక్షలకు దిగారు. గురువారం కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నగర శివారులోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ 13 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు ఆందోళనకారులను వాహనంలో తరలించే సమయంలో అసభ్యపదజాలంతో మహిళా కార్యకర్తలను దూషించారని పేర్కొంటూ పోలీసు శిక్షణ కేంద్రంలోనే ఆందోళనకు దిగారు. పోలీసులను సస్పెండ్‌ చేయాలని కోరారు. పోలీసులు ఉన్నతాధికారులు వారిని సముదాయించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు గూడెం లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, మచ్చ రమేశ్‌, కె.బుచ్చన్న యాదవ్‌, కిన్నెర మల్లేమ్మ, కె.సంతోష్‌చారీ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు శేఖర్‌, గుడికందుల సత్యం, జిల్లా నాయకులు
ఎస్‌.రజనీకాంత్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద దీక్ష : ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లోని కలెక్టరేట్‌ ముందు దీక్షా శిబిరాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, యూ.శ్రీనివాస్‌, ఎస్‌.నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సృజన్‌కుమార్‌, గూడెం లక్ష్మి, పైడిపల్లి రాజు, మణికంఠరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌)ఎన్‌డీ నాయకులు జిందం ప్రసాద్‌, కిషన్‌, రమేశ్‌, పార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా అధ్యక్షుడు గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.