close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

నిరసనలు.. ధూంధాంలు

పదమూడో రోజుకు ఆర్టీసీ సమ్మె
న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన సమ్మె పదమూడో రోజుకు చేరుకుంది. గురువారం కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోల పరిధిలో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు, ధూంధాం నిర్వహించారు. సమ్మెకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. .

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన సమ్మె పదమూడో రోజుకు చేరుకుంది. గురువారం కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోల పరిధిలో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు, ధూంధాం నిర్వహించారు. సమ్మెకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు ఒకటో, రెండో డిపో ముందు ధర్నా నిర్వహించడంతో పాటు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజా రవాణా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఐకాస నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌ బస్టాండ్‌లో జరిగిన సమావేశంలో ఐకాస నాయకులు జక్కుల మల్లేశం గౌడ్‌, ఎ.వి.ఆర్‌.రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 13 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డీజిల్‌పై భారాన్ని ప్రభుత్వమే భరించాలని, ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా న్యాయవాదులు బేతి మహేందర్‌రెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమ అసోసియేషన్‌ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటుందన్నారు. సమ్మెకు మద్దతుగా నేడు విధులు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. సమ్మెకు సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
* డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు గురువారం కరీంనగర్‌లో ఒకటో, రెండో డిపోల ముందు ధర్నా నిర్వహించారు. వివిధ వేషధారణలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం కార్మికులతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ఎన్‌.కె.రాజు, మనోహర్‌, చారి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
* ఆర్టీసీ, ప్రభుత్వం ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కరీంనగర్‌ రీజియన్‌లోని పది డిపోల పరిధిలో శుక్రవారం 632 బస్సులు నడిపించింది. ఇందులో 433 ఆర్టీసీ, 199 అద్దె బస్సులను తిప్పినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇందుకు 444 మంది డ్రైవర్లు, 511 మంది కండక్టర్లను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నామని, 377 బస్సుల్లో టిమ్స్‌ ద్వారా, 99 బస్సుల్లో సాధారణ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు వివరించారు. త్వరలోనే అన్ని బస్సుల్లో టికెట్లను అందుబాటులోకి తెస్తామని, బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాల ద్విచక్రవాహన ర్యాలీ
కరీంనగర్‌ విద్యావిభాగం : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుస్‌పీసీ)ల ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి స్థానిక బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టి కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జాక్టో, యుస్‌పీసీ సంఘాల రాష్ట్ర ప్రతినిధి ఎం.రఘుశంకర్‌ రెడ్డి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ఇతర కార్మిక సంఘాలు బాసటగా నిలవాలన్నారు. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు జాక్టో, యుఎస్‌పీసీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని తెలిపారు. జాక్టో జిల్లా ఛైర్మన్‌ సుంకిశేల ప్రభాకర్‌, యుస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎ.శ్రీనివాస్‌రెడ్డి, టి.తిరుపతి, జాక్టో, యుస్‌పీసీ బాధ్యులు కె.రమేశ్‌, కె.చంద్రమౌళి, ఎం.ఎ.ఖాద్రీ, జె.రాంచంద్రారెడ్డి, రాజనర్సు, కె.కుమారస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.