close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన

ప్రగతిభవన్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు గురువారం కొనసాగాయి. అందులో భాగంగా ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్‌ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌ ముట్టడికి బయల్దేరాయి. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రగతిభవన్‌కి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. 20మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓయూ విద్యార్థులు నిర్వహించిన మరో సమావేశానికి ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని కేసీఆర్‌ కుటుంబానికి లీజుకు ఇచ్చేందుకే ప్రైవేటుపరం చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 19న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొంతమంది టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులు సమ్మెకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓయూ విద్యార్థి ఐకాస నాయకులు మాట్లాడుతూ ఈ నెల 25న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జీ నేమూరి శంకర్‌గౌడ్‌, ఓయూ ఎస్సీ, ఎస్టీ నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు.

మూసాపేట వైజంక్షన్‌లో ధూంధాం
మూసాపేట, న్యూస్‌టుడే: మూసాపేట వైజంక్షన్‌లో ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమం జరిగింది. కార్మికులు బైఠాయించి నిరసన తెలపగా విపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రజాగాయకుడు దరువు అంజన్న బృందంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలపించిన గీతాలు కార్మికులను అలరించాయి. మిగతా కళాకారులు సైతం తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు, నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్‌ పన్నాల కావ్యారెడ్డి, భాజపా నేత పన్నాల హరీష్‌రెడ్డి, డిపో ఐకాస నేతలు పాల్గొన్నారు.

సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి
మాజీ ఎంపీ వి.హన్మంతరావు
కాచిగూడ, విద్యానగర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. గురువారం ఆయన కాచిగూడ డిపో వద్ద కార్మికులకు మద్దతుగా, బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌ డీడీ కాలనీలోని కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి మధ్యవర్తిగా ఉండేందుకు ఎంపీ కేశవరావు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను పట్టించుకోకుండా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బీసీ ఓట్లను రాబట్టుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని అన్నారు. ఈ నెల 19న చేపట్టే ఐకాస బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కోదండరెడ్డి, మహేందర్‌, సుదర్శన్‌, కమలాకర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, వైఆర్‌రెడ్డి, అజయ్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

‘సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులకు మద్దతు’
బన్సీలాల్‌పేట్‌: రాణిగంజ్‌ సంయుక్త డిపో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె ఉద్ధృతమవుతోంది. గురువారం డిపోవద్ద ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సర్వే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కృషితోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఇక్కడి పరిస్థితులు సోనియాగాంధీకి వివరించడంతో ఓ రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ప్రకటించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక దళితుణ్ని సీఎం చేస్తానని ఓట్లు దండుకొని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు వారికి అండగా ఉంటామన్నారు.

మరిన్ని వార్తలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి. వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు

ముంబయి అంతే.. హైదరాబాద్‌ ఇంతే!

ప్రపంచంలోని వంద ప్రధాన నగరాల్లోని రహదారుల స్థితిగతులపై సర్వే నిర్వహిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి చివరి స్థానంలో నిలిచింది.. సగటు మనిషి ప్రయాణ వ్యయం, పెట్రోలు ధర, వార్షిక రహదారి పన్ను తదితర అంశాల్లో చిట్ట చివర నిలిచింది. యూరోపియన్‌కు చెందిన కారు విడి భాగాల విక్రయ సంస్థ ‘మిస్టర్‌ ఆటో’ ఈ సర్వే చేపట్టింది. వంద నగరాల్లో మొత్తంగా కెనడాలోని కల్గరీ నగరం తక్కువ వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాల మరణాలు, సరసమైన ప్రయాణ వ్యయంతో ఉత్తమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ముంబయి రహదారులు బాగుంటాయని కితాబిచ్చిన నగర యంత్రాంగం, హైదరాబాద్‌ నగరం సర్వేలో ఉండి ఉంటే ఏ స్థానం దక్కేదో అంచనా వేసుకోవాలి. ప్రపంచ పర్యాటకులు భాగ్యనగరం వైపు చూస్తోన్న తరుణంలో..

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.