close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అమర వీరులారా.. వందనం

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం


పోలీసు అమరవీరుల స్మారక చిహ్నం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : దేశ సరిహద్దులో పహారా కాస్తూ అంతర్గతంగా ప్రజలకు రక్షణగా ఉంటూ.. అహర్నిశలు శ్రమిస్తున్నారు.. అటు సైనికులు.. ఇటు పోలీసులు. 1959, అక్టోబరు 21న భారత్‌-చైనా సరిహద్దులో 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవానులు మొదలుకొని నేటి వరకు నిత్యం మన రక్షకులు దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారు. అసాధారణరీతిలో విధులు నిర్వర్తిస్తూ అందరికీ స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పిస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకు సంబంధించి అమరవీరులను ఓసారి స్మరించుకుంటే..

నంద్యాలకు చెందిన డానియేలు 1987లో ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్‌గా చేరారు. 2000, జనవరి 11న ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు కాగజ్‌నగర్‌లో నక్సల్స్‌ అమర్చిన మందుపాతర పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.

నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లెకు చెందిన రవిశేఖర్‌ 1995లో ఏపీఎస్పీ రెండో పటాలం కానిస్టేబుల్‌గా చేరారు. 2000, జనవరి 11న సిర్పూరు కాగజ్‌నగర్‌లో జరిగిన మందుపాతర పేలుడులో చనిపోయారు.

పీఎస్పీ రెండో పటాలానికి చెందిన శ్రీరాములు 1987లో పోలీసు శాఖలో చేరారు. 1990, డిసెంబర్‌ 18న ఆదిలాబాద్‌ జిల్లాలో నక్సల్స్‌ అమర్చిన మందు పాతరకు బలయ్యారు.

డోన్‌ మండలం ఎంబాయికి చెందిన ప్రభాకర్‌రెడ్డి 1981లో ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్‌గా చేరారు. 1999, డిసెంబర్‌ 19న ఆదిలాబాద్‌ జిల్లాలో కూంబింగ్‌ విధులు నిర్వర్తిస్తూ మందు పాతరలో ప్రాణాలు వదిలారు.

ఏపీఎస్పీ రెండో పటాలానికి చెందిన వెంకటరాజు 1983లో పోలీసుశాఖ చేరారు. 1991, జూన్‌ 10న అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన పేలుడు ఘటనలో బలైపోయారు.

దేవనకొండ మండలం తెర్నేకల్‌ చెందిన డి.వెంకటేశ్వర్లు 1987లో కానిస్టేబుల్‌గా చేరారు. 1989, అక్టోబర్‌ 17న కరీంనగర్‌ జిల్లాలో నక్సల్స్‌ దాడిలో అసువులు బాశారు.

ప్రకాశం జిల్లా బెస్తవారపేటకు చెందిన అబ్దుల్‌కరీం 1965 కానిస్టేబుల్‌గా చేరారు. 1992, మార్చి 17న ఆత్మకూరు సమీపంలో బస్సులో ప్రయాణిస్తుండగా నక్సల్స్‌ కాల్చి వేశారు.

కర్నూలుకు చెందిన నర్సింహులు 1995లో కానిస్టేబుల్‌గా చేరి మళ్లీ 2002 ఆర్‌ఎస్సైగా ఎంపికయ్యారు. 2005, జూన్‌ 24న కడప నల్లమల అడవుల్లో నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

ఎమ్మిగనూరు మండలం చెన్నాపురానికి చెందిన రాముడు 1992లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టారు. 2008, మే 17 కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యోదంతంలో బలైపోయారు.

ఓర్వకల్లుకు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డి 1991 కేంద్ర రక్షణశాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2010 ఏప్రిల్‌ 6న చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల దాడిలో అసువులు బాశారు.

బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన ముస్తాక్‌ అహ్మద్‌ దేశ సరిహద్దులోని మంచుకొండల్లో పహారా కాస్తూ ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.