close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

వినియోగదారుల్లో చైతన్యం అవసరం


ధర్మకాటా వద్ద అధికారులు

కర్నూలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: వినియోగదారులు చైతన్యవంతులైతేనే తూకాలు, కొలతల్లో మోసాలను అరికట్టవచ్చని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ ఎం.గోపికృష్ణారెడ్డి అన్నారు. ఆ శాఖ అధికారులు ఆదివారం నగరంలోని సి.క్యాంపు, పెద్దమార్కెట్‌, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కూరగాయల మార్కెట్‌లో ధర్మకాటాను ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేశారు. గాయత్రీ ఎస్టేట్‌ సమీపంలోని ఓ చికెన్‌ దుకాణంలో కాటాకు ముద్ర వేయించుకోకపోవడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్‌ కంట్రోలర్‌-1, 2 శ్రీరాముడు, జిలానీబాషా, కడప అసిస్టెంట్‌ కంట్రోలర్‌ సుధాకర్‌, ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, పరమేశ్వర కుమార్‌, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.