close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

బేడబుడగ జంగాలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి

కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: బేడ బుడగ జంగాల కులస్థులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జాతీయ బేడ బుడగ జంగాల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.ఆర్‌.వెంకటేశం అన్నారు. బేడబుడగ జంగాల జాతీయ స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని కర్మన్‌ఘాట్‌లోని ఓ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సీటీ మాజీ ప్రొ. ఎన్‌ఆర్‌ వెంకటేశం (తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా డా. బాలగురుమూర్తి (కర్ణాటక), గౌరవ అధ్యక్షులుగా సిరివాటి నరసింహులు ( కర్ణాటక), ఉపాధ్యక్షులుగా ఎలమర్తి మధు (ఆంధ్రప్రదేశ్‌), సిరిగిరి మన్యం (తెలంగాణ), సోమాజి రామన్న (మహారాష్ట్ర), వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా కడమంచి సహదేవ్‌ (తెలంగాణ), జాయింట్‌ సెక్రటరిగా డా. కళ్లే ఆంజనేయులు (తెలంగాణ) ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.