close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

నేటి నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు

కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో దసరా సెలవుల పొడిగింపు ఆదివారంతో పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. గత నెల 28 నుంచి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. ఈ నెల 14 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 20 వ తేదీ వరకు వాయిదా వేశారు. 5వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. సోమవారానికి ఆర్టీసీ సమ్మె 17 వ రోజుకు చేరనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగనుందని ఆర్టీసీ ఐకాస ప్రతినిధులు ప్రకటించారు. ఇక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్‌ఏ-1 పరీక్షలను ఈ నెల 23కు బదులు 25 వ తేదీ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఈ నెల 25 నుంచి నవంబరు 1 వ తేదీ వరకు నూతన కాల పట్టికను విద్యాశాఖ ప్రకటించింది. 27న దీపావళి పండగ ఉన్నందున మరుసటి రోజు పరీక్ష ఉండదని విద్యాశాఖ సూచించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.